OSG NEWS

రవీంద్రభారతిలో ఘనంగా దీపావళి సంబరాలు

OSG NEWS 31-10-2024

 

స్థానిక ఆనందపురం రవీంద్రభారతి పాఠశాలలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు.

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పాఠశాల ప్రిన్సిపాల్ మంగలక్ష్మి అన్నారు.లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారని,దీప మాలికల శోభతో వెలుగొందే గృహాంగణాల దీపముల వరుస దీపావళి అని ఉత్తరాంధ్ర జోనల్ ఇంచార్జ్ యెన్.వెంకటేష్ అన్నారు.ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలని,ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుందని,దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి అని,దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారని సీ.జీ .యం జీ.ఆర్. వసంత అన్నారు.కార్యక్రమములో పాఠశాల చిన్నారులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.చిన్నారుల వస్త్రాలంకరణ,వేషధారణలు,రంగు రంగుల రంగవల్లికలు,దీపకాంతులు ఆహుతులను ఎంతగానో అలరించాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *