OSG NEWS

అడ్డూ అదుపు లేని కాలుష్య పరిశ్రమలు, తీర ప్రాంతం కబ్జాదారులమధ్య మత్స్యకారుల జీవితాలు ఆగమ్యగోచరంగా తయారయ్యాయని గ్రామాభివృద్ధి సేవాసంఘం అధ్యక్షులు, మత్స్యకారుల నాయకుడు గంటా నూకరాజు ఆవేదన వ్యక్తం చేసారు.

OSG NEWS 21-11-2024

గురువారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్బంగా మత్స్యకారుల సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా విశాఖ జిల్లా మత్స్యకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం భీమిలి జోనల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహర దీక్షలు ఎనిమిదివ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా గంటా నూకరాజు మాట్లాడారు. సముద్రం అంతా కాలుష్య పరిశ్రమలు వదిలిన కెమికల్ తో నిండిపోయి మత్స్య పరిశ్రమ కుదేలయిందని అన్నారు. తెచ్చిన చేపలకు గిట్టుబాటు ధరలు లేక నానా అవస్థలు పడుతున్న మత్స్యకారులకు ఒకపక్క పొల్యూషన్, మరోపక్క తీర ప్రాంతంను కబ్జా చేసిన కబ్జాదారులతో సతమతమవుతున్నామని అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్బంగా పండగ వాతారణంలో ఉండవలసిన మత్స్యకారులు అనేక సమస్యలతో సతమతమవుతూ రోడ్డెక్కవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేడు తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులు దీనస్థితిలో ఉన్నారని గంటా నూకరాజు అన్నారు. మాజీ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షులు కోలా గురువులు నిరసన కార్యక్రమానికి వచ్చి సంఘీభావం తెలియజేసి మాట్లాడారు. కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేవిధంగా ప్రతీ మత్స్యకారుడు ముందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఇంత దౌర్భాగ్యం ప్రశాంత విశాఖ జిల్లాలో జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మొద్దునిద్రలో ఉందా అని ప్రశ్నించారు. కబ్జా కోరులు ఎంత స్థాయిలో ఉన్నాసరే వారిని ప్రతిఘటించే స్థాయి మత్స్యకారులకు ఉందని, వారియొక్క ఓర్పు, సహనాన్ని పరీక్షించొద్ధని అన్నారు. అడ్వకేట్ పుక్కళ్ళ నాగరాజు మాట్లాడుతూ కష్టపడి పనిచేయడం, నీతిగా బ్రతకడం మాకు తెలిసిన విద్య అని అన్నారు. తాతలు ముత్తాతలు దగ్గర నుండి సముద్రాన్నే నమ్ముకొని జీవిస్తున్న మా బ్రతుకులపై కొంతమంది కబ్జా చోరులు మా హక్కుకు భంగం కలిగించే విధంగా చేస్తున్నారని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. వంకా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏంతో పవిత్రంగా, దేవాలయాలుగా బావించే స్మశానాలను కూడా కబ్జా చేస్తున్నారంటే వారు ఎంత హీనమైన స్థితికి దిగజారారో అర్ధం కావడం లేదని అన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినాసరే స్పందించక పోవడం మరీ వింతగా ఉందని అన్నారు. మధర్ పాఠశాల ప్రిన్సిపాల్ చీకటి రమేష్ మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా మత్స్యకారులు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తే కనీసం అధికారులు వచ్చి ఏమి జరుగుతుందో తెలుసుకోవలసిన బాధ్యత అయినా ఉందా.. లేదా..? అని ప్రశ్నించారు. అధికారులు కూడా కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారా అని నిలదీశారు. మత్స్యకారులకు చాలా ఓర్పు సహనం ఎక్కువని దాన్ని అమాయకత్వంగా తీసుకుంటే అది ఎంతటి స్థాయిలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించడం కష్టమని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు తగిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలిసి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎగువపేట గ్రామ పెద్దలు వాసుపల్లి గరగయ్య, పుక్కళ్ళ ఎల్లారావు, పుక్కళ్ళ అమ్మోరు, కారి చిన్నారావు, వాసుపల్లి హరిబాబు, దూడ నూకరాజు, బుద్ధా రాజు, అల్లిపిల్లి గురువులు, అల్లిపిల్లి అప్పలరాజు, పుక్కళ్ళ కోదండ, వాసుపల్లి ప్రసాద్, వాసుపల్లి దాసు, వాసుపల్లి అప్పలరాజు, బోయవీధి గ్రామ పెద్దలు కాసరపు దుర్గారావు, కొక్కిరి కాశీడు, కొక్కిరి నూకరాజు, తెడ్డు సింహాద్రి, వాడమొదలు కృష్ణ, తోటవీధి గ్రామ పెద్దలు నొల్లి రమణ, సూరాడ పరదేశి, గ్రామాభివృద్ధి సేవాసంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లిపిల్లి నర్సింగరావు, కార్యదర్శి వాసుపల్లి కొండబాబు, కోశాధికారి బర్రి కొండబాబు, పైడిపల్లి నర్సింగరావు, నాగమయ్య పాలెం పెద్దలు బొడ్డు దుర్గారావు, తోట ఎల్లారావు, ఉమ్మడి భాస్కర్ రావు, కొమర అప్పలరాజు, చోడిపిల్లి చిట్టారంజన్ దేశాయ్, కాసరపు ఎల్లాజీ, దూడ తాతలు, మైలపల్లి శ్రీహరి, గంటా నూకన్న, పీరుపిల్లి మసేను, పీరుపిల్లి నర్సింగరావు, దూడ సోములు, కోనాడ అప్పారావు, గరికిన కోదండ, కోడ చిన్నీలు, కారి ఎల్లాజీ, వాసుపల్లి ఎల్లాజీ, వాసుపల్లి రవి, వాడమొదలు తవుడయ్య, కాసరపు ఎల్లాజీ, దూడ కొండలరావు, పీరుపిల్లి సత్యం, వాసుపల్లి శ్రీనివాసరావు, గరికిన అప్పలరాజు అధికసంఖ్యలో మహిళలు, యువత పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *