OSG NEWS

విశాలాంధ్ర పుస్తక మహోత్సవం ను తిలకించిన మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు

OSG NEWS 21-112024

ఇరవై మూడవ విశాలాంధ్ర పుస్తక మహోత్సవం ను ఈరోజు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పుస్తక ప్రియులకోసం అన్నిరకాల పుస్తకాలను ఒకే చోట దొరికేలా ఎర్పాటు చేస్తూ ప్రజాదరణ పొందుతున్న విశాలాంధ్ర సిబ్బందిని అభినందించారు భారత దేశంలో రోజు రోజుకు పుస్తక పఠనం పెరుగుతుందని డిజిటల్ యుగంలో కూడా పుస్తకలవైపు ఆసక్తి చూపుతున్న పాఠకులకు అభినందనలు తెలిపారు ప్రతి ఒక్కరూ రోజులో ఒక గంటైన పుస్తకాలు చదివితే జ్ఞానం విజ్ఞానం వివేకం అలవరచుకోవచ్చని ప్రతిఒక్కరూ విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనను తిలకించి వారి భవిష్యత్తుకు దోహదపడే పుస్తకాలను పొందలని ఆయన అన్నారు ఈ పుస్తక ప్రదర్శన నేటితరం యువతకు ఎంతో దోహదపడుతుందన్నారు అనంతరం వివిధరకాల పుస్తకాలను ఆయన తిలకించారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *