డాక్టర్ బాబూరావు సేవలు అపూర్వం
21-11-2024
దివంగత డాక్టర్ బాబూరావు
సంస్మరణ సభ సావిత్రి బాయి ఫూలే ఎడ్యుకేషనల్, చారిటబుల్ ట్రస్ట్ (స్పెక్ట్) చైర్ పర్సన్, గూడూరు సీతా మహాలక్ష్మి, ఆధ్వర్యంలో మాధవధార కమ్యూనిటీ హాలు లో బుధవారం జరిగింది. గత 2O ఏళ్లుగా స్పెక్ట్ కి వారు అందించిన అద్భుతమైన, అనన్య సామాన్య మైన సేవలను, మార్గ దర్శకత్వాన్ని వక్తలు వివరించారు. అదే విధంగా అనేక సంస్థలతో వారు కలిసి పనిచేసారు అని గుర్తు చేశారు. వారివి
బహుముఖ సేవలు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. అమరావతి విశ్వ సాహితి సంస్థ నుండి పీ.ఎల్.వీ. ప్రసాద్ సాహితి వేత్త గాను, సంస్థ అధ్యక్షులు గాను బాబూరావు అందించి న సేవలను కొనియాడారు. వారి స్ఫూర్తితో ఈ వేదిక పై ప్రసాద్ టోటల్ బాడి డొనేషన్ విల్లు పేపర్స్ సీతమహాలక్ష్మికి అందించారు.
అలాగే రైల్వే ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాబూరావు అందించిన సేవలను అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు సభకు వివరించారు.
డాక్టర్స్ అసోసియేషన్ నుండి బాబూరావు సహధ్యాయులు (19 61 బ్యాచ్, ఏఎంసీ) డాక్టరు తిలక్, డాక్టరు పరుశురాం మాట్లాడారు. 25 వేల వాసెక్టమీ ఆపరేషన్ లు చేసి గొప్ప సర్జన్ గా రికార్డు సృష్టించి, గోల్డ్ మేడల్ అందుకున్న వృత్తి నైపుణ్యలను, పేదల డాక్టర్ గా వారు అందించిన సేవలను వివరించారు. మురళి నగర్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులుగా డాక్టర్ బాబురావు చేసిన సేవలను వాకర్స్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు కొనియాడారు. వెటరన్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాబూరావు అందించిన సేవలను ఆ సంస్థ అధ్యక్షుడు సుధాకర్ వివరించారు. నేత్ర, శరీర దానం చేసిన డాక్టర్ బాబూరావు చనిపోయాక కూడా జీవించే ఉన్నారని, ప్రస్తుతం అనటమీ ప్రొఫే సర్ గా వైద్య విద్యార్థులకు తన దేహం ద్వారా పాఠాలు భోదిస్తున్నారని శరీర, అవయవ దాతల సంఘం కార్యదర్శి నూకరాజు ప్రశాంగించారు.
స్పెక్ట్ నుండి నర్రా అమ్మాజీ , హెచ్ ఆర్ సి నుండి శ్యాం ప్రసాద్ కుటుంబములో ఆయనపాత్ర ఎంత ఆదర్శం వంతమైనదో బాబూరావు కుమార్తె సుచిత్ర, తమ్ముడు కప్పల ప్రసాద్ మాస్టారు వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ శరీర, అవయవ దాతల సంఘం ప్రధాన కార్యదర్శి వి. వినోద్ బాలు ప్రసంగిస్తూ, బాబురావు అంతిమ ఆశయం అయిన నేత్ర, శరీర దానాన్ని అమలు చేసిన కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.