సమస్యలపై కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ వినతి
OSG NEWS 19-11-2024
ఆనందపురం.
మండలంలోని వేములవలస పంచాయతీలో నెలకొని ఉన్న పలు సమస్యలపై జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణమూర్తికి స్థానిక పంచాయతీ ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఇళ్ల స్థలాల పంపిణీలో పలు అవకతవకలు జరిగాయని స్థానికులకు గాని దళితులకు గాని సరైన న్యాయం జరగలేదని విజ్ఞప్తి చేశారు. అలాగే వేములవలస కూడలి లో ట్రాఫిక్ ఇబ్బందులుతీవ్రంగా ఉన్నాయని మూడు జిల్లాలకు వెళ్ళవలసిన వాహనాలు ఈ రహదారి గుండా వెళ్లడంతో బిజీగా మారిందని సమస్యను పరిష్కరించాలని కోరారు. వర్షాకాలంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. సీఈఓ తో పాటు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో జానకి, గ్రామీణ మంచినీటి పథకం ఎస్. ఈ. చౌదరిఉన్నారు