మద్యం ధరలు తగ్గిస్తామన్నారు !
మరి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుంటున్నాయి వాటి సంగతేంటి ? – సిపిఐ
మద్యం ధరలు తగ్గించి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు నిత్యం వాడుకొంటున్న బియ్యం, పప్పులు, వంట నూనె మొదలైన వస్తువులు ధరలు నియంత్రించాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీగా పెరిగిన ధరలు తగ్గించాలని సిపిఐ
గురువారం జీవీఎంసీ 5 వ వార్డు నగరంపాలెం, పోర్టు కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటి ఇంటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించిన కార్యక్రమంలో పైడిరాజు మాట్లాడుతూ భారీగా ధరలు పెరుగుదలపై ప్రజలు ద్రుష్టి మల్లించడానికి సనాతనాధర్మం, తిరుపతి లడ్డు అంశాలు తీసుకొని రావడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి ట్రిక్కులు చెయ్యడం న్యాయం కాదని పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మోయలేని భారమౌతున్న ధరలు వెంటనే తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జిల్లా సమితి సభ్యురాలు ఎం డి బేగం, ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, డి సతీష్, కె చిన్నా, పి రమణ, రాము, నాయుడు తదితరులు పాల్గొన్నారు.