తాను మరణించి… మరో నలుగురులోజీవించాడు.
-ఘన నివాళులర్పించిన కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర్ ప్రసాద్
విశాఖ:19-11-2024
తాను చనిపోతూ మరో నలుగురు ప్రాణాలు కాపాడారు విశాఖకు చెందిన వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే… ఈ నెల 17వ తేదీన దువ్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వాసిరెడ్డి రామారావు (57) తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పృహ కోల్పోయారు,దీనితో స్థానికులు దగ్గర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ లో తీవ్ర రక్తస్రావం అవుతుందని గుర్తించారు. అతన్ని రక్షించడానికి రెండు రోజుల పాటు వైద్యులు ఎంతో శ్రమించారు ,అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వైద్య బృందం సోమవారం బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. ఆ తర్వాత అవయవదానంపై వైద్య బృందం వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అవగాహన కల్పించారు.. అవయవ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో ఈ విషయాన్ని జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కే రాంబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు.. ఆయన రామారావు శరీరంలో పనిచేస్తున్న ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, అవయవాలను సేకరించేందుకు అనుమతి జారీ చేశారు. సేకరించిన అవయవాలను జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం నలుగురికి కేటాయించారు.. అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు… అలాగే విజయవంతంగా అవయవాలను సేకరించి తరలించిన వైద్య బృందానికి..గ్రీన ఛానల్ ద్వారా అవయవాలు వేగంగా చేరేందుకు సహకరించిన నగర పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చికు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. దీనితో రామారావు చనిపోతూ మరో నలుగురు జీవితాల్లో వెలుగులు నింపింనందుకు గర్వంగా ఉందని మృతిని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఘన నివాళి
నలుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన రామారావు పార్ధవ దేహానికి జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర్ ప్రసాద్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 95 ప్రకారం రామారావు మృతదేహానికి గౌరవ వందనం చేస్తూ ఘన వీడ్కోలు పలికారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రశంసా పత్రం తో పాటు అంతక్రియలు నిమిత్తం పదివేల రూపాయలను కలెక్టర్ అందజేశారు..
రామారావు కుటుంబం స్ఫూర్తిదాయకం
-కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర్ ప్రసాద్
కుటుంబంలోని పెద్ద దిక్కుని కోల్పోయిన బాధలో కూడా మరో నాలుగు కుటుంబాల సంతోషం కోసం ఆలోచించిన రామారావు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర్ ప్రసాద్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగువేల మంది రోగులు వివిధ అవయవాలు కోసం ఎదురుచూస్తూ చీకటి జీవితాలను గడుపుతున్నారన్నారు.. అలాంటి వారందరికీ రామారావు కుటుంబం తీసుకున్న నిర్ణయం ఎంతో ధైర్యాన్నిస్తుందన్నారు. అనుకోని ప్రమాదం వలన కుటుంబ సభ్యులకు కోల్పోయినప్పుడు కుటుంబ సభ్యులు ధైర్యం తెచ్చుకొని వేరొకరి జీవితాలకు కొత్త వెలుగులు నింపేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రామారావు రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ధరించలేదని కాబట్టే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం వలన మృతి చెందారన్నారు. ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించటం తప్పనిసరి చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవయవదానంపై విస్తృత ప్రచారం చేస్తూ అవయవ దానాలకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్న జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కే రాంబాబు కృషి అభినందనీయమన్నారు.. మరింతగా అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా సూచించారు..
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
-డాక్టర్ కే రాంబాబు, రాష్ట్ర కోఆర్డినేటర్, జీవన్ దాన్
అవయవ దానంపై రాష్ట్రవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది.. అందువల్లనే ఈ మధ్యకాలంలో అవయవాలు దానం చేసేందుకు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు.. అవయవాల కోసం రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో రోగులు ఎదురుచూస్తున్నారు.. ఇలా అవయవ దానం చేసేందుకు ముందుకు రావడం ద్వారా వారి జీవితాల్లో నూతన వెలుగులను నింపిన వాళ్లమవుతాం.. అవయవ దానం పై ఉన్న అపోహలను వీడి అవయవాల కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి అండగా నిలవాలి