OSG NEWS

*నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచవిక్రయాలు*

*నివాస గృహాలు గ్రామ కూడలి మధ్య విక్రయాలకు ఏర్పాట్లు*

*వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు*

*అనుమతులకు అధికారులు*

నిబంధనలకు విరుద్ధంగా జన సంసారం లో గృహాల మధ్య మతాబులవిక్రయాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండల కేంద్రంలో గతంలో అధికారులను ప్రసన్నం చేసుకొని గ్రామం మధ్యలో విక్రయాలు జరిపి వారు. గత ఏడాది విక్రయాల పరిస్థితిని విలేకరులు ఉన్నతాధికార దృష్టికి తీసుకువెళ్లగా నిలిపివేశారు. దీంతో వ్యాపారులు ఈ ఏడాది అనుమతులు తెచ్చుకునేందుకు తహసిల్దార్ కు దరఖాస్తు చేశారు. అగ్నిమాపక శాఖ కు దరఖాస్తు చేయగా నిబంధనలతో అనుమతి మంజూరు చేశారు, దీనికి పోలీసులు కూడా సహకరిస్తూ తమ అంగీకర పత్రాన్ని అందజేసినట్లు తెలుస్తోంది. వాస్తవంగా బాణాసంచా విక్రయాలు గ్రామ శివారులో మైదానంలో లేదా ఖాళీ ప్రదేశాల్లో విక్రయాలు జరపాలిసి ఉంది. కానీ చీడికాడ మండల కేంద్రంలో ఆటో స్టాండ్ అంటూ దరఖాస్తు చేయడంతో అధికారులు చూడకుండా స్థల పరిశీలన జరపకుండా అగ్నిమాపక శాఖ అనుమతి ఇచ్చేసింది. వాస్తవంగా ఆటో స్టాండ్ అన్నది గ్రామ నడిబొడ్డు, ఆటో స్టాండ్ పక్కన సామాజిక భవనం నివాస గృహాలు, ఆంజనేయ స్వామి ఆలయం, కెనరా బ్యాంకు, కిరాణా దుకాణాలు, తినుబండారాల దుకాణాలు కూరగాయల దుకాణాలు చుట్టూరా ఉన్నాయి, ఈ ప్రాంతంలో అనుమతులు ఎలా ఇచ్చారో అధికారులకే తెలియాల్సి ఉంది.మండల కేంద్రంలో దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయానికి ఇరువురు వ్యక్తులు అనుమతులు కోరుతూ అధికారులను ఆశ్రయించారు. అగ్నిమాపక సిబ్బంది. ఇరువురికి అనుమతులు ఇచ్చేందుకు సిఫార్సు చేశారు. దీనికి స్థానిక పోలీసులు సైతం సిఫార్సు అందించారు. నివాస గృహాల మధ్య అనుమతులు కోరడంపై గ్రామస్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఇబ్బందులు పడే కన్నా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని. అనుమతులు ఇచ్చేటప్పుడు కాలీ ప్రదేశంలో బహిరంగ ప్రదేశంలో విక్రయించలని అనుమతులు ఇవ్వాలని, అధికారులు అనుమతులు ఇచ్చే ముందు ఆలోచించుకొని ఇవ్వాలని, గ్రామస్తులు కోరుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *