*రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అప్డేట్*
*విశాఖపట్నం*OSG NEWS
*29.10.2024*
– విశాఖపట్నం జిల్లా పరిషత్ కార్యాలయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష
– గతంలో తమ అక్రమాల కోసం ఎక్సైజ్ శాఖను రెండుగా విడగొట్టి మొత్తం వ్యవస్థనే హేళన చేశారు.
– అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఎక్సైజ్ శాఖను మళ్లీ పునరుద్ధరించడం సంతోషంగా ఉంది
– గత ఐదేళ్లు మద్యం తయారీ నుండి అమ్మకం వరకు ప్రతి చోటా అక్రమాలు చోటు చేసుకున్నాయి.
– మద్యం అక్రమాల్లోని సూత్రధారులు, పాత్రధారులపై తప్పకుండా చర్యలుంటాయి
– 2019లో తెలంగాణ ఆదాయంతో పోలిస్తే ఏపీ ఆదాయం కేవలం రూ.4వేల కోట్లు తక్కువ
– 2024 నాటికి తెలంగాణ కంటే రూ.42 వేల కోట్ల తక్కువ ఆదాయం రావడానికి కారణాలు గత పాలనలోని అక్రమాలే
– ఎన్ని ఇబ్బందులున్నా.. అత్యంత పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపును పూర్తి చేశాం
– దాదాపు 90 వేల దరఖాస్తులు రావడం మన సమర్థతకు నిదర్శనం.
– రాష్ట్రంలోని ఎక్సైజ్ సిబ్బంది, అధికారులు ఒకే మాటపై నిలబడి పాలసీ అమలును విజయవంతం చేశారు.
– మనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు మద్యంపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది
– నాణ్యమైన మద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి.
– గతంలో మద్యం నాణ్యతను కనీసం పరీక్షించే నాధుడు కూడా లేడు.
– కానీ నేడు మనం 9 దశల్లో పరీక్షించి షాపులకు తరలిస్తున్నాం
– ప్రతి బాటిల్ కూడా ట్రాక్ చేసేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం
– గంజాయి నిర్మూలనకు కూడా ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుకుంటున్నాం
– త్వరలోనే గంజాయిని పూర్తి నిర్మూలనకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నాం
– రాష్ట్రంలో బెల్టు షాపుల నిర్వహణ, కల్తీ మద్యం అమ్మకాలపై కఠిన మైన చర్యలుంటాయి
– తప్పు చేస్తే ఎవరైనా ఉపేక్షించబోమనే సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచన