OSG NEWS 11.11.2024
భారతదేశం విద్యతోనే అభివృద్ధి చెందారని ఆకాంక్షించిన గొప్ప వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ అని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ మరియు విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం జ్యోతి కుమారి అన్నారు. భీమునిపట్నం డైట్ లో సోమవారం
ప్రముఖ దార్శనికుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు మరియు స్వతంత్ర భారత తొలి విద్యా మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె అధ్యాపకులతో కలిసి ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం మాట్లాడుతూ ఆయన దూరదృష్టి వల్ల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు,యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వంటి కీలక సంస్థలు ఏర్పడటం సాధ్యమైందని, ఆజాద్‌ను దేశంలో ఉన్నత విద్యకు ప్రేరణ ఇచ్చిన మహనీయునిగా పరిగణిస్తారని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఆధ్యాపకులు ఎల్ సుధాకర్, జిజిఎస్ నాగేశ్వరరావు, గొట్టేటి రవి, జె. మాధవి, ఎస్. త్రినాధరావు, ఆర్. నీలిమ తదితరులు పాల్గొన్నారు.