యువత, మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి
సభ్యత్వ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
OSG NEWS SUNDAY 03-11-2024
మహిళా సంక్షేమానికి, యువత ఉపాధి అవకాశాలు మెరుగుకు కూటమి సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని భీమిలి జోన్ 3వ వార్డు అధ్యక్షులు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు.
భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశానుసారం తోటవీధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం గంటా నూకరాజు సమక్షంలో నిర్వహించారు. వందమందికి పైగా క్రియాశీల సభ్యత్వం పొందిన టిడిపి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభ్యత్వాల నమోదుకు పిలుపునిచ్చిన తరువాత ఎక్కువగా యువత, మహిళలు స్పందించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. వీరిద్దరూ ఈ రాష్ట్ర సంక్షేమానికి రెండు కళ్ళు అని అన్నారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు, మహిళలలకు డ్వాక్రా సంఘాలు ద్వారా మెరుగైన జీవన విధానం దిశగా చంద్రబాబు సర్కార్ ఆలోచన చేస్తుందని అన్నారు. మన ప్రియతమ నాయకులు గంటా శ్రీనివాసరావు సూచనలు మేరకు భీమిలి నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు చేసేవిధంగా చేయాలన్న పిలుపుమేరకు అడుగులు వేస్తున్నామని అన్నారు. భీమిలి జోన్ 3వ డివిజన్ లో కూడా అత్యధిక సభ్యత్వాలు నమోదు అయ్యేవిధంగా కృషి చేస్తామని గంటా నూకరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చురకల రమణ, మారోజు సంజీవకుమార్, నొల్లి రమణ, అర్ధపాకల గురునాధ్, బొడ్డు రమేష్, సూరాడ పరదేశి, జలగడుగుల మురళి, రాజగిరి రమణ తదితరులు పాల్గొన్నారు.