ఎస్ వి ఎల్ ఎన్ ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఇన్ చార్జ్ ప్రిన్సిపాల్ డా. సి.హెచ్ విష్ణు మూర్తి అధ్యక్షతన NSS PO డా. డి. ప్రవీణ జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డా. సి.హెచ్ విష్ణుమూర్తి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ భారత ప్రథమ విద్యాశాఖా మంత్రిగా చేసిన సేవ కొనియాడారు. ఈ కార్య క్రమం లో భౌతిక శాస్త్ర అధ్యాపకులు శ్రీ బి. ప్రసాద్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గురించి చెప్తూ అందరికీ విద్య అందడానికి ఆయన ప్రవేశపెట్టిన విధానాలను వివరిస్తూ విద్య ఆవశ్యకతను తెలియ జేశారు. ఈ కార్యక్రమం లో ఆంగ్ల అధ్యాపకులు శ్రీమతి డి. మాధురి ఇతర అధ్యాపక బృందము మరియు విద్యార్థులు పాల్గొన్నారు.