OSG NEWS 15-11-2021
ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాడిన యువకిశోరం బిర్సా ముండా అని, స్వాతంత్రం కోసం బ్రిటీష్ వారిని ఎదిరించిన మన్యం వీరుడు బిర్సా ముండా అని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ ఎం. జ్యోతి కుమారి అన్నారు. శుక్రవారం డైట్ లో ఆదివాసి వారసత్వం పరిరక్షణ పేరున జరిగిన బిర్సా ముండా జన్మదిన వేడుకలలో ఆమె మాట్లాడారు. 1875 లో ఝార్ఖండ్ లో జన్మించిన బిర్సా, మిషనరీ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ, పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నారని అన్నారు. ఆదివాసీల భూములపై అధిక పన్నులు వసూలు చేస్తున్న బ్రిటిష్ పాలకులను ఎదిరించి ‘రాజుల రాణుల పాలన పోవాలి – మన పాలన ప్రారంభించాలి’ అనే నినాదంతో ఆదివాసీలను ఏకం చేసి 1899లో ‘ఉల్ గులాం తిరుగుబాటు’ పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడని, అది సహించని బ్రిటిష్ పాలకులు 19 ఫిబ్రవరి 3న 25 ఏళ్ల బిర్సాను అరెస్టు చేసి రాంచీ జైలులో విష ప్రయోగంతో హత్య చేశారని తెలిపారు.
భారత ప్రభుత్వం ఆయన దేశభక్తిని పోరాటపటిమను గుర్తించి గౌరవించి పార్లమెంటు సెంట్రల్ హాలులో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించిందని అధ్యాపకుడు గొట్టేటి రవి అన్నారు ట్రైబల్ హెరిటేజ్ సందర్భంగా చాత్రోపాధ్యాయులు విల్లంబులు, బెలూన్లతో డైట్ లో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు ఎల్. సుధాకర్ జి జి ఎస్ నాగేశ్వరరావు, సి ఏ సోమయాజులు, జి. రవి, తదితరులు పాల్గొన్నారు