3 వ వార్డులో 5 వేలు సభ్యత్వ నమోదు జరిగేలా నా వంతు కృషి చేస్తా
OSG NEWS29-10-2024
భీమిలీ 3 వ వార్డులో 5 వేలు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయాలనే ధ్యేయంతో ఉన్నామనీ భీమునిపట్నం 3 వ వార్డు అధ్యక్షుడు గొలగాని నరేంద్ర కుమార్ అన్నారు. స్ధానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 వ వార్డు అధ్యక్షుడు గా నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుతాననీ అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధిష్టానం కార్యక్రమం శనివారం భీమిలి టిడిపి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లక్ష సభ్యత్వ నమోదు చేయాలనీ అన్నారు. అయితే 3 వ వార్డుకు 5 వేల సభ్యత్వాల నమోదు టార్గెట్ ఇచ్చారనీ 5 వేల సభ్యత్వాలను నమోదు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. టీడీపీ నాయకులు , కార్యకర్తలు గత ఎన్నికల్లో ఎంతలా కృషి చేసారో అదేవిధంగా ఈసారి కూడా ప్రతీ ఒక్కరూ కష్టపడి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోవాలనీ అన్నారు.