బౌలింగ్‌లో సత్తా చాటిన ఆంధ్ర జట్టు
198 పరుగులు చేసిన హిమాచల్ ప్రదేశ్
విశాఖపట్నం OSG NEWS 27-10-2024
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు బౌలింగ్‌లో సత్తా చాటింది. ఆంధ్ర, హిమాచల్‌ప్రదేశ్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ అదివారం విశాఖపట్నం పీఎం పాలెంలోని ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలి ఇన్నింగ్స్ లో ఆంధ్ర బ్యాటింగ్ బరిలో దిగి 344 పరుగులు చేసి అలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో మ్యాచ్ ముగిసేసరికి హిమాచల్ ప్రదేశ్ 198 పరుగులు చేసింది. తొలి రోజు ఇన్నింగ్స్ లో గడిచిన 80 ఓవర్లకు 295 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోగా రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 92.4ఓవర్లు లో 344 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది.
ఆంధ్ర –హిమాచల్ ప్రదేశ్ రంజి మ్యాచ్ లో భాగంగా రెండో రోజు మొదటి ఇన్నింగ్స్ తో బ్యాటింగ్ బరిలో దిగిన హిమాచల్ ప్రదేశ్ జట్టు గడిచిన 65 ఓవర్లలో 198 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.ముందుగా దిగిన ఓపెనర్ బ్యాట్సె్మన్లు అంతగా రాణించలేక తక్కువ పరుగులకే వికెట్ల కోల్పోయిన పరిస్థితి నెలకొంది. మిడిల్ ఆర్డర్లో దిగిన అంకిత్ ఆర్ కాల్సీ 53 పరుగులతో అర్థ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు. తరువాత దిగిన ఆకాష్ పి వశిష్టు 52 పరుగులతో అర్థ సెంచరీ చేయగా,జట్టు కెప్టెన్ రిషి ఆర్ ధావన్ 38 పరుగులు చేసి ఇద్దరూ నాటౌట్ బ్యాట్సె్మన్లుగా మ్యాచ్ సమయం ముగిసేసరికి బరిలో నిలిచారు. బౌలింగ్ బరిలో దిగిన ఆంధ్ర జట్టు బౌలర్ కెవి శశికాంత్ తన అద్భుతమైన బౌలింగ్ తో హిమాచల్ ప్రదేశ్ పరుగులకు బ్రేకులు వేశాడు. తను వేసిన 15 ఓవర్లలో ఆరు మేడిన్ ఓవర్లు వేసి, 50 పరుగులు ఇచ్చి మూడు వికెట్లను కైవసం చేసుకున్నాడు. త్రి పూర్ణ విజయ్ ఒక వికెట్ ను సొంతం చేసుకున్నాడు. ఆంధ్ర అద్భుతమైన బౌలింగ్ తో హిమాచల్ ప్రదేశ్ పరుగులకు బ్రేకులు వేసి స్కోర్ ని నిలుపుదల చేశారు.