OSG NEWS

*మారుమూల ప్రాంతాల్లో క్రికెట్‌ అభివృద్ధికి ఏసీఏ మార్క్‌ చూపిస్తాం*

 

*యువతలో దాగి ఉన్న క్రికెట్‌ స్ఫూర్తిని వెలికి తీసేందుకు చర్యలు*

 

*విశాఖ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమణాలతో కూడిన వసతులు కల్పిస్తాం*

 

*రాష్ట్రంలో మూడు చోట్ల సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ కార్యాలయాలు ఏర్పాటు*

 

*ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్‌*

 

విశాఖపట్నం

 

రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి యువతలో దాగి ఉన్న క్రికెట్‌ స్ఫూర్తిని వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్ర∙క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కేశినేని శివనాథ్‌ (చిన్ని) వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్‌బాబు, ఉపాధ్యక్షులు పి.వెంకట రామ ప్రశాంత్, జాయింట్‌ సెక్రెటరీ పి.విష్ణుకుమార్‌రాజు, ట్రెజరర్‌ డి.శ్రీనివాస్, కౌన్సిలర్‌ దంతు గౌర్‌ విష్ణు తేజ్‌లను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ.. క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అరకు లాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మార్క్‌ను చూపిస్తామన్నారు. ప్లేయర్లు మెరుగైన శిక్షణ పొందేందుకు వీలుగా ఇటీవల బీబీసీఐ ఆధ్వర్యంలో బెంగుళూరులో ప్రారంభించిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కార్యాలయ తరహాలో రాష్ట్రంలో కూడా ఏసీఏ ఆధ్వర్యంలో సౌత్‌ జోన్, నార్త్‌ జోన్, సెంట్రల్‌ జోన్లలో ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. విశాఖ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీఏ కార్యదర్శి కె.పార్థసార«థి, ఉపాధ్యక్షులు డి.ఎస్‌.వర్మ, డి.సంజీవ్, చంద్రమౌళేశర్‌రావు, కోశాధికారి భోగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

 

*జిల్లా కార్యవర్గ సభ్యులతో సమావేశం..*

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుకోవడానికి వీలుగా ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్‌ బాబు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులతో చర్చించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమావేశమై స్థానికంగా ఉన్న సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించేందుకు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

విజయనగరంలో ఉన్న నార్త్‌ జోనే క్రికెట్‌ అకాడమీని అప్‌ గ్రెడేషన్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మిగిలిన 9 జిల్లాల క్రికెట్‌ అధ్యక్ష, కార్యదర్శులతో సోమవారం సమావేశం కానున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *