వికలాంగులకి అండగా ఉరుకూటీ చైతన్య
OSG NEWS
డిసెంబర్ 8 నుండి దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్. విశాఖపట్నం నవంబర్ 10.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ తొలిసారిగా డిసెంబర్ 8 నుండి 11వ తేదీ వరకు హిందుస్థాన్ జింక్ క్రికెట్ మైదానంలో దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని పది జిల్లాల నుండి పది టీములు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. దివ్యాంగుల క్రికెట్ కంట్రోల్ బోర్డుకు అనుబంధంగా ఉన్న ఏపీ స్టేట్ దివ్యాంగుల క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలకు గాను ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ ఉరుకూటి చైతన్య లక్ష రూపాయలు మరియు 70వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చట్టి గోపి పాతికవేల రూపాయలు విరాళంగా ఇచ్చారు.ఈ పోటీలను ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్నట్లు ఊరుకూటి చైతన్య తెలియజేశారు. ఈ సందర్భంగా వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు గాజువాక సమీపంలోని జింక్ మైదానం జరుగు దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్,కార్యదర్శి జి.శ్రీనివాస్ బ్రాడ్కాష్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, వందే భారత్ బ్లడ్ బ్యాంకు అధినేత వినోద్ బాలు టోర్నమెంట్ నిర్వాహకులు మణికంఠ, హేమ సుందర్, బలరామకృష్ణ,షేక్ హుస్సేన్, సూరిబాబు, నందం సాయి, బలరామ కృష్ణ,ప్రవీణ్, కోదండం తదితరులు పాల్గొన్నారు