OSG NEWS 07-12-2024విద్యార్థులు కష్టపడి విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు చిన్నచిన్న త్యాగాలు చేయాలి*మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయితీ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, మండల నాయకులు, విద్యార్థినీ విద్యార్థులు, స్కూల్ ఎస్ఎంసి సభ్యులు, స్కూల్ నందు జరిగే కార్యకలాపాల కోసం పిల్లలకు తమతో ఉన్న అనుబంధం, విద్కభ్యాసం కోసం తెలియజేసారు అనంతరం పిల్లలు పిల్లల తల్లిదండ్రులచే సాంస్కృతిక నృత్యాలు రంగవల్లులు ప్రదర్శించారు, ప్రధానోపాధ్యాయులు కొండబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ముఖ్యంగా స్త్రీలకు 18 ఏళ్లు నిండకుండా బాల్యవివాహాలు చేయకూడదని ప్రతి ఒక్కరూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మిస్సైల్ మాన్ అబ్దుల్ కలాం వారు వంటి ఎత్తుకు ఎదగాలని వారికి హిత బోధలు చేశారు తల్లిదండ్రులకు కూడా ఇంటి వద్ద పిల్లలతో ఒక సమయాన్ని కేటాయించి వారి విద్యా విధానం ఎలా ఉంటుందో అని మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునే బాధ్యత వారికి వివరించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మండల నాయకులు ఎస్ఎంసి సభ్యులు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వానపల్లి ముత్యాలరావు, వైస్ ఎంపీపీ బొట్ట రామకృష్ణ, ఎస్ఎంసి చైర్మన్ చల్లా రామిరెడ్డి, కొండబాబు, ఉప సర్పంచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు