OSG NEWS 06-12-2024
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, ప్రపంచ మేధావి,బహు ప్రజ్ఞ శాలి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, డా.బి.ఆర్.అంబేద్కర్ 68 వా వర్ధంతి సందర్భంగా ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం ఉదయం ఏపీ రాష్ట్ర ఎస్సీ నేత ఉప్పాడ అప్పారావు అధ్యక్షతన . అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళిలు అర్పించారు. బాబా సాహెబ్ డా అంబేద్కర్ కోసం ఉప్పాడ అప్పారావు, మారుపిళ్ళ చిన్నయ పాత్రుడు మాట్లాడుతు రాజ్యాంగ అనే ఒక గ్రంధం వ్రాసి ప్రపంచనీకే మార్గం చూపిన మహానుభావులు రాజకీయ వ్యవస్థకు, చట్టనీకి, న్యాయవ్యవస్థకి ఆయన మాటలు వేదవాక్కు, ఆయన కేవలం బడుగు బలహీన వర్గాలకు మాత్రమే నాయకులు కాదని మానవ మనుగుడ ఉన్నంతవరకు ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయలని కొనియాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ భావిశెట్టి భారతమ్మ, ప్రసాద్ పట్నాయక్, మరుపిళ్ళ చిన్నయ్య ప్రాతుడు, కూరకుల వెంకటేష్,దళాయి శివ, మీసాల రామానాయుడు,గుండు నానాజీ, పంచాయతీ కార్యదర్శి శివ ప్రసాద్,ఎమ్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.