బోసు బాబు దాతృత్వం
ఇద్దరు బాలికలకు సైకిళ్ల పంపిణీ
OSG NEWS 09-12-2024 మండలంలోని గొట్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు పేద విద్యార్థినులకు సోమవారం శ్రీ మహాలక్ష్మి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ( బోసు బాబు) సైకిల్ లను పంపిణీ చేసి ఆయన దాతృత్వాన్ని చాటి చెప్పారు. గొట్టిపల్లి హై స్కూల్లో చదువుతున్న చీమల మెట్టపాలెం నకు చెందిన జాన వరలక్ష్మి ( 9వ తరగతి ), కుసులువాడ గ్రామానికి చెందినపిళ్లా వర్ష( 7వ తరగతి) ఆయా గ్రామాల నుండి నిత్యం పాఠశాలకు నడిచి రావలసి ఉండడంతో ఈ విషయాన్ని స్థానిక నాయకులు బోసు బాబు దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన ఆయన ఇద్దరు విద్యార్థినులు కి సైకిల్ లు కొనుగోలు చేసి ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. మండలంలోని విద్యాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న బోసుబాబు కు స్థానిక నాయకులు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బంటు అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోరాడ నాయుడు బాబు, పాఠశాల కమిటీ కమిటీ చైర్మన్ వెన్ని నారాయణరావు, గిడిజాల మాజీ సర్పంచ్ కోరాడ రాము, కూటమి నాయకులు ఎర్ర బంగారు నాయుడు ( బన్నీ), కోరాడ వైకుంఠ, కోరాడ తమ్మునాయుడు, సుంకర శివ ఇతర నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.