రొయ్యల హేచరీల ఆకస్మిక తనిఖీలు
జాయింట్ కలెక్టర్/ చైర్మన్, టాస్క్ ఫోర్స్ కమిటీ, విశాఖపట్నం వారి ఆదేశాల మేరకు పి లక్ష్మణరావు, జాయింట్ డైరెక్టర్, మత్స్య శాఖ ఆధ్వర్యంలో తేదీ 22.01.2025 న భీమిలి మండలంలోని రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో మంగమారిపేట మరియు తిమ్మాపురం సమీపంలోని పలు హేచరీలలోని వసతులు, రొయ్య పిల్లల ఉత్పత్తి ప్రక్రియలో వాడుతున్న ప్రోబయోటిక్స్, ట్రీట్మెంట్ ప్లాంట్స్, బ్రూడ్ స్టాక్ లను పరిశీలించారు. తదుపరి పరీక్షల నిమిత్తం ఎంపెడ (MPEDA) వారు నమూనాలు సేకరించారు. ఆక్వా కల్చర్ మరియు ఆక్వా సంబంధ యూనిట్లలో నిషేధిత యాంటీబయోటిక్స్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించిన దృష్ట్యా టాస్క్ ఫోర్స్ కమిటీ ఈ యూనిట్ లను పరిశీలించింది. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రసాద్ నాయక్- ఎ.డి. ఎం పేడ (MPEDA), అభిప్రియ-డ్రగ్ ఇన్స్పెక్టర్, ఆనంద్ రావు – ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్, లావణ్య- మత్స్య శాఖ అభివృద్ధి అధికారి హెచరీస్ అసోసియేషన్ ప్రతినిధులు పి ఎన్ వి ప్రసాద్ మరియు డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.