OSG NEWS 19-01-2025విజ్ఞాన విహార గుడిలోవ ఆవరణలో తేదీ. 19.01.2025 న హెడ్గేవార్ నూతన ఆరోగ్య కేంద్రం ప్రారంభింపబడినది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖా మాత్యులు గౌ. శ్రీ సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిందాలని, వివిధ రకాల వైద్య పరీక్షలు త్వరలో గ్రామాల్లో ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి చేస్తామని గుర్తించిన కేసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వైద్యం అందిస్తామని ముఖ్యంగా స్త్రీలలో వచ్చే వివిధ రకాల కేన్సర్స్కు స్క్రీనింగ్ వైద్యం ఆయుష్మాన్ భారత్ ద్వారా అందుతోందని దీనిని అందరూ వినియోగించుకోవాలని, గ్రామాలకు యూనిట్లుగా తీసుకొని రాబోయే నెలలులో ఇంటింటికి వైద్య పరిక్షలు జరుగుతాయని తెలిపారు.ప్రముఖ హృద్రోగ నిపుణులు డా. సి.వి.రావు మాట్లాడుతూ నేటి వర్తమాన పరిస్థుతులలో మానవ. జీవనశైలిలో వచ్చిన పెనుమార్పుల వలన అధిక రక్తపోటు, మదుమేహం వంటివి చిన్న వయస్సులోనే వస్తున్నాయని, సాంకేతిక సమాచారాన్ని తన విజ్ఞతతో తగు మోతాదులో ఉపయోగించుకోవాలని సూచించారు.ముఖ్య అతిధి ఆర్.ఆర్.ఎస్.ఎస్. కార్యకారిణి సభ్యులు మాననీయ శ్రీ భాగయ్య మాట్లాడుతూ మన వ్యవసాయ సాగులో రసాయనిక ఎరువులు తగ్గించి గో ఆధారిత సేంద్రియ పద్ధతి ద్వారా సాగు చేయాలని, రైతులందరూ దీనికి సంకల్పించి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని, వ్యవసాయ, కుటీర ఉత్పత్తులు ప్రోత్సాహం ఎరగడం ద్వారా గ్రామాభివృద్ధి సాధ్యమౌతుందని, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు గ్రామాల్లోనే ఉపసమనం లభించే ఆరోగ్య కేంద్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
హెడ్గేవార్ నూతన ఆరోగ్య భవనానికి వీరితో పాటుగా కమిటీ కార్యదర్శి శ్రీ జిసుబ్రహ్మణ్యం, కోశాధికారి శ్రీ జి. వెంకటప్పుడు, అధ్యక్షులు శ్రీ పి.వి. నారాయణయరావు పాల్గొనగా, అఖిల భారత విద్యా భారతి అధ్యక్షులు. విజ్ఞాన విహార డైరెక్టర్ గౌ. దూసి రామకృష్ణ రావు మాట్లాడుతూ ముఖ్యంగా గత 40 సంవత్సరాలుగా హెడ్గేవార్ ఆసుపత్రి కొనసాగిస్తున్న సేవలు, గ్రామాల్లో గర్భిణి స్త్రీలకు ప్రసూతి సేవలు. ఇలా ఎన్నో రకాల వైద్య సేవలను విస్తృతం చేస్తూ అరోగ్యకరమైన సమాజానికి డా. హెడ్గేవార్ ఆరోగ్య కేంద్రం సేవలు కొనసాగిస్తామని తన నివేదికలో చాలా అంశాలు పేర్కొన్నారు.
వివిధ గ్రామాల సర్పంచులు. యమ్.టి.సి. ఆశా కార్యకర్తలు, మెడికల్ ఆఫీసర్స్, వైద్య వృత్తిలో ఉన్న పూర్వ విద్యార్ధులు, కమిటి సభ్యులు, సైనిక్ ప్రముఖ్, సిబ్బంది, వందలాది ప్రజానీకం పాల్గొని జయప్రదం చేసారు.