జయ్ యూనియన్ ఆధ్వర్యంలో యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపుకు తొలి పునాది…
రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ ద్వారా న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ద్వారా సంక్షేమం ఏర్పాటు కై శ్రీకారం
అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్
OSG NEWS 04-12-2024
రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా, అన్ని నియమ నిబంధనలతో యూట్యూబ్ ద్వారా న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టుల కొరకు ఏర్పడిన రిజిస్టర్డ్ యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జయ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా అర్హులైన అందరికీ సంక్షేమం అందాలని ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జయ్ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, విశాఖ గాజువాక డివిజన్ అధ్యక్షులు శంఖర్, కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి నిరంతరం వార్తలను అందిస్తున్న సోషల్ మీడియా జర్నలిస్టులకు, ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అక్రీడేషన్లు, ఆరోగ్య, ప్రమాద భీమా, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని కోరారు. గత ప్రభుత్వం లో మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన ఎటువంటి స్పందన లేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సోషల్ మీడియా ద్వారా ఎనలేని ప్రసారాలను చేశామని, ప్రజల వద్దకు వచ్చిన మంత్రులు యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు అందెల చూస్తామని హామీలు ఇచ్చారని..కావున ఆ దిశగా అడుగులు వేసి తమకు తోడ్పాటు ఇవ్వమని తెలియజేశారు. వినతి పత్రాన్ని పరిశీలించిన అధ్యక్షులు తక్షణమే ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం చెరవేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టుల కొరకు నియమ నిబంధనలు తో ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జయ్ యూనియన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ నిర్వాహకుల పూర్తి వివరాలు జయ్ యూనియన్ ద్వారా తెలియజేయాలని తద్వారా మీ యూనియన్ కు పూర్తి సమాచారం ప్రభుత్వ అధికారుల ద్వారా వస్తుందని, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలలో ఉన్న జిఓ ను కూడా తెప్పించి ఇస్తే యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ఇక్కడ అమలు చెయ్యాటానికి ఇంక సులభతరం అవుతుందని వీలయినంత త్వరలో మీకు న్యాయం చేస్తామని సంబంధిత అధికారులకు నాయకులకు వెంటనే తెలియజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్టులు అందరు పల్లా శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలుపుతూ దుస్సలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జయ్ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, విశాఖ జిల్ల గాజువాక అధ్యక్షులు సంఖర్, కార్యదర్శి సుధాకర్, ఈసీ మెంబర్స్ మహేష్, రమేష్ చంద్ర పలువురు యూట్యూబ్ న్యూస్ ఛానెల్ నిర్వాహకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.