భారత రాజ్యాంగ నిర్మాత జర్నలిస్టు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్స్ జై యూనియన్ ఆధ్వర్యంలో ఘన నివాళులు…
OSG NEWS 06-12-2024
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో యూట్యూబ్ జర్నలిస్టులు విస్తరించిన నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, లౌకికవాదం, భావవ్యక్తీకరణ, సంపూర్ణ హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్న అన్ని జిల్లా కేంద్రాలలో యూట్యూబ్ జర్నలిస్టులు ఘన నివాళులు అర్పిస్తూ..జై భీమ్, రాజ్యాంగ సృష్టి కర్త అమర్ రహే, అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా ఫోర్త్ ఫిల్లర్ గా హక్కును కల్పించిన.. జర్నలిజానికి మాయని మచ్చగా కొందరు ఫేక్ జర్నలిస్టులుగా చలామణి అవుతూ జర్నలిజానికి తీరని లోటుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, రాజకీయ, అధికార యంత్రాంగం తో పాటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ల ద్వారా ఫేక్ జర్నలిస్టులు గా చెలామణి అవుతూ సమాజంలో తిరుగుతున్న చిడపురుగులను ఎరేయాలని అన్నారు. మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్ర సమాచార పర్మిషన్లు తీసుకుని నియమ నిబంధనలతో యూట్యూబ్ ప్లాట్ఫారం గా చేసుకుని నిరంతరం వార్త సేకరణ చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెల్తూ నిరంతరం కృషి చేస్తున్నారని. కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అందటంలో తీవ్ర జాప్యం జరుగుతుందని వాపోయారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులతో రిజిస్టర్డ్ చేయించుకుని ఏర్పాటు అయినా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జయ్ సంఘం ఆధ్వర్యంలో సోషల్ మీడియా ద్వారా చెడు ప్రసారాలు చేస్తూ ఫేక్ జర్నలిస్టులు గా చెలామణి అవుతున్నవారిని ఎరిపారేసే దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వ రాజకీయ అధికారుల దృష్టికి వర్కింగ్ జర్నలిస్టుల కు సంక్షేమం కల్పించాలని పలు వినతి పత్రలు అందజేయటం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా యందు యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందజేసిన విశాఖ సిటీ కమిషనర్ శంఖ బ్రాత బాగ్‌చి గారికి, ఎసిపి లక్ష్మణ్ మూర్తి గారికి మిగతా జిల్లాలో పర్మిషన్లు ఇచ్చిన ఉన్నత పోలీస్ అధికారులకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం రాష్ట్ర జర్నలిస్టులు అందరు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హ్యూమన్ రైట్స్ చైర్మన్ జాన్ విక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటున్న జర్నలిస్టులు 24గంటలు వార్త సేకరణలో భాగంగా అనేక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొంటారని వారికి కావాల్సిన చేయూత ప్రభుత్వం ఇవ్వాలని తమ ఆవేదన వ్యక్తం చేశారు