OSG NEWS026-11-2024
ఈ నెల 24వ తారీకున విజయవాడలో చేన్ను పాటి రామకోటయ్య స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సెవెంత్ స్టేట్ లెవెల్ స్కై మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో విశాఖపట్నం స్కై మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ విద్యార్థులు రెండు బంగారు పతకాలు,ఒక సిల్వర్ పథకం సాధించారు-50 కేజీల కేటగిరిలో పోతిన ప్రవీణ్, కె . ప్రేమలత. గోల్డ్ మెడల్,74 కేజీల కేటగిరి విభాగం లో జి .మోహన్ సిల్వర్ మెడల్ సాధించారు అని విశాఖపట్నం జిల్లా స్కై మార్షల్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బొద్దపు బంగార్రాజు తెలియజేశారు ఈ సందర్భంగా అయన మాటాడుతు విజేతలకు అభినందనలు తెలుపుతూ . 2025 జనవరి 28 నుంచి ఉత్తరఖాండ్ లో జరిగే 38 వ నేషనల్ గేమ్స్ కి మన రాష్టం నుంచి. పోతిన ప్రవీణ్. కే . ప్రేమలత. ఎంపిక అయ్యారు వారు యంపిక కావడం ఆనందం గా వుంది గత సంవత్సరం గోవాలో జరిగిన 37వ నేషనల్ గేమ్స్ లో కూడా పోతిన ప్రవీణ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించగా 38వ నేషనల్ కూడా వీరు ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి మన విశాఖపట్నం జిల్లాకి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మరియు పెద్దలు క్రీడాకారులు వారికి అభినందనలు తెలియజేశారు