రన్ ఫర్ అంబేద్కర్” కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్
OSG NEWS 29-11-2024
ఈరోజు ఆర్కే బీచ్ నుంచి YMCA వరకు జరిగిన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజ్యాంగ ఆమోదం దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం లో భారీగా ప్రముఖులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు నేటి సమాజం అనుసరిస్తుందని అన్నారు. జై భీమ్ నినాదాలతో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం పొఫెసర్ జాన్ , శ్రీ ఆరేటి మహేష్ ఆధ్వర్యంలో విజయవంతం గా జరిగింది. అనంతరం ఎమ్మెల్యే వంశీగారు రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అల్పాహారం వడ్డించి, స్వీకరించారు.కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ శ్రీ సంపత్ కుమార్ , ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు ,ప్రముఖులు విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.