OSG NEWS 26-11-2024
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
ట్రింకోమాల్కు 450 కి.మీ., నాగపట్నంకు 740 కి.మీ.,
చెన్నైకు 940 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం.
ఇది వాయవ్య దిశగా కదులుతూ ఈరోజు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం.
తదుపరి రెండు రోజుల్లో శ్రీలంక, తమిళనాడు తీరాలవైపు పయనించే అవకాశం.
వాయుగుండం చెన్నైకి సమీపంలో లేదా శ్రీలంక తీరం వద్ద తీరం దాటే అవకాశం.
రానున్న రెండు రోజుల్లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.
మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు.
మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు.
అన్ని పోర్టులలో ఒకటవ ప్రమాద హెచ్చరికలు జారీ.
వర్షాలు నేపథ్యంలో రైతు వ్యవసాయ పనులలో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ సూచన.