OSG NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అనందపురం 10: మండలంలోని గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2014- 15 విద్యా సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు

ఈ కార్యక్రమంలో ఆనందపురం ఎంఈఓ-2, పూర్వపు ఉపాధ్యాయులు గంగరాజు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఎంత ఉన్నస్థితికి వెళ్లిన ఉపాధ్యాయులకు పిల్లలే అన్నారు

విద్యార్థుల సమ్మేళన సమాజ సేవకి నాంది కావాలన్నారు. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను విద్యార్థులు ఉపాధ్యాయులు నెమరు వేసుకున్నారు. విద్యార్థులు ఉన్న స్థితికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో పాటు విద్య

అందించిన ఉపాధ్యాయులకు ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు.

విద్యార్థులు సేవా బవాన్ని అలవర్చుకొని

సమాజ, దేశ అభివృద్ధికి తమ వంతు సేవనందించాలన్నారు

పాఠశాల పూర్వ విద్యార్థులు శినగం రాజా త్రివేణి (పండు), శినగం స్వాతి, శినగం తులసి,

కంది సురేష్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల అనంతరం విద్యార్థులందరినీ ఒక్క తాటిపై తీసుకువచ్చి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఐక్యంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ఒకరికి ఒకరు కష్ట సుఖాల్లో తోడు ఉంటామని ప్రతిజ్ఞ చేసుకున్నారు

ఈ సందర్భంగా పలువురు గురువులను ఘనంగా సన్మానించారు

అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆనాటి ప్రధానోపాధ్యాయులు

ఇమంది పైడ్రాజు, ఉపాధ్యాయులు అప్పలనాయుడు, గొర్లి కృష్ణ, చైతన్య,రమేష్, 17 మందిఉపాధ్యాయులు, 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *