*మహిళ సంక్షేమానికి పెద్ద పీట*
*ఉచిత సిలిండర్లకు ఏటా రూ.2,684 కోట్లు*
*భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు*
భీమిలి OSG NEWS 01-11-2024
మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, అందులో భాగంగానే దీపం – 2 పథకాన్ని రూపకల్పన చేసిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలి మండలం వలందుపేటలో శుక్రవారం ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఆర్థిక దన్ను ఇస్తాయని, దీని కోసం ప్రభుత్వం ఏటా రూ. 2,684 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తినప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోందని తెలిపారు. ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను నెరవేర్చడంలో భాగంగానే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లర్లకు పెన్షన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. చెప్పినట్టుగానే 16,347 పోస్టులలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై గుంతలు పూడ్చడానికి రూ.868 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. విశాఖను ఐటీ హబ్ గా చేయడానికి మంత్రి లోకేష్ చేసిన కృషి వల్ల 10 వేల ఉద్యోగావకాశాలు కల్పించే డెవలప్మెంట్ సెంటర్ ను టీసీఎస్ ప్రారంభించనుందన్నారు. ఈ సందర్భంగా పలువురికి ఆయన పెన్షన్లు అందించారు. కార్యక్రమంలో జెడ్.సి. ప్రేమ ప్రసన్న వాణి, కూటమి నాయకులు కోరాడ రాజబాబు, పంచకర్ల సందీప్, కె.రామానాయుడు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, గంటా నూకరాజు, శాఖారి శ్రీనివాస్, మొల్లి లక్ష్మణరావు, తాట్రాజు అప్పారావు, అక్కరమాని వెంకట్రావు, వి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు