అసోసియేషన్ ఆఫ్ భీమిలీ క్రికెటర్స్
(ఏ.బి.సి) ఆధ్వర్యంలో జరుగుచున్న
ఫ్రీడం కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన గంటా రవితేజ
OSG NEWS 01.11.2024
భీమునిపట్నం
అసోసియేషన్ ఆఫ్ భీమిలీ క్రికెటర్స్
(ఏ.బి.సి) ఆధ్వర్యంలో ఫ్రీడం కప్ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం గౌరవ అధ్యక్షులు గంటా. రవితేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ దాదిరెడ్డి శైలేంద్ర రెడ్డి 1996 లో ఏ.బి.సి ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి ప్రముఖ వైద్యులు దాదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఫౌండర్ గా వ్యవహరిస్తూ వారి తల్లితండ్రుల జ్ఞాపకార్థం వారి ఆర్థిక సహకారంతో ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ గత 28 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని, సుధాకర్ రెడ్డి అనంతరం వారి కుమారుడు శైలేంద్ర రెడ్డి ఈ టోర్నమెంట్ కొనసాగించడం గర్వకారణం అని అన్నారు. ఏ.బి.సి అధ్యక్షులు కైతపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో 14 టీములు పాల్గొంటాయని , ప్రతి టీం, అన్ని టీములతో రౌండ్ రాబిన్ ఆడుతాయని, ఫైనల్స్ డిసెంబర్ 1వ తారీఖున జరుగుతుందని గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారని తెలిపారు. కార్యదర్శి గొలగాని నరేంద్ర మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ అనంతరం 1,2,3,4 వార్డులలో ఉన్న అన్ని గవర్నమెంట్ ప్రయివేటు పాఠశాలలో 6,7,8 తరగతులు చదువుతున్న విద్యార్థులను కూడా ఏ.బి.సి లో చేర్పించి వారికి కూడా టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రేమ ప్రసన్నవాణి, 2వార్డు కార్పొరేటర్ గాడు చిన్నికుమారిలక్ష్మి, గంటా నూకరాజు, అక్కరమాని రామునాయుడు, గాడు అప్పలనాయుడు, జీవన్, కంటుబుక్త రామానాయుడు, కనకల.అప్పల నాయుడు, షేక్ అన్వర్, కాసరపు ఎల్లాజీ గరే సదానంద, ఏ బి సి ఉపాధ్యక్షులు సిహెచ్ చిన్నారావు కోశాధికారి సంతోష్, సహయ కార్యదర్శి అడిదం.అంజనీ కుమార్, ఏ బి సి సభ్యులు ఎ లోవరాజు మొకర.నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు