*బీచ్ లో “విక్టరీ ఎట్ సి” స్తూపం పై అద్భుతంగా లేజర్ షో నిర్వహణ*
*అధిక సంఖ్యలో వీక్షించిన ప్రజలు, బీచ్ సందర్శకులు*
*జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు పి. శివప్రసాద్ రాజు*
విశాఖపట్నం OSG NEWS SUNDAY
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అక్టోబర్ 27 (ఆదివారం) సాయంత్రం 7 గంటలకు జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ ఆదేశాల మేరకు బీచ్ వైఎంసిఎ సమీపాన ” విక్టరీ ఎట్ సీ ” స్థూపముపై సౌండ్ మరియు లేజర్ ప్రదర్శన అద్భుతంగా నిర్వహించడం జరిగిందని , అధిక సంఖ్యలో ప్రజలు, బీచ్ సందర్శకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారని జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు పి. శివప్రసాద్ రాజు శుక్రవారం ప్రదర్శన వద్ద పేర్కొన్నారు.
ఈ లేజర్ షోలో 1971 నౌకాదళం యుద్ధం మరియు విశాఖ నగరం యొక్క పాత్ర, యుద్ధ వీరుల సాహసాల తో పాటు దేశ చరిత్ర ను తెలిపే విధంగా అద్భుతమైన లేజర్ షో ఆదివారం నిర్వహించడమైనదన్నారు. ఈ కార్యక్రమం మూడు సంవత్సరాల పాటు జీవీఎంసీ కాంట్రాక్టు ఇవ్వడం జరిగిందని, ప్రతి ఆదివారం ప్రజల వీక్షణార్థం ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని ప్రధాన ఇంజనీర్ తెలిపారు. ఇండియన్ నేవీ సహకారంతో ఇది రూపకల్పన చేయగా జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రదర్శనను నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు ,బీచ్ సందర్శకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడం చాలా ఆనందంగా ఉందని ఇది విశాఖపట్నం ప్రాముఖ్యతను,దేశ చరిత్రను తెలిపే విధంగా ఈ లేజర్ షో ను రూపొందించడమైనదని ప్రధాన ఇంజనీర్ తెలిపారు. ఈరోజు ఈ లేజర్ షో నిర్వహణకు సహకరించిన పోలీస్ యంత్రాంగానికి,ఇండియన్ నేవీ వారికి జీవీఎంసీ కమిషనర్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు ప్రధాన ఇంజనీర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అజిత , అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్) రాజ్ కమల్, జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీర్ పి వి వి సత్యనారాయణ రాజు, సహాయక ఇంజనీర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
*పౌర సంబంధాల అధికారి , జివిఎంసి*