సాగర తీరంలో ఎండ్ పోలియో డే
రొమ్ము క్యాన్సర్ అవగాహన పై వాక్
OSG NEWS 27.10.2024
విశాఖ సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఎండ్ పోలియో డే, రొమ్ము క్యాన్సర్ అవగాహన పై నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. క్వాంటమ్ స్పెషలిటీ డయాగ్నస్టిక్స్, రోటరీ క్లబ్ వైజాగ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నడక కార్యక్రమాన్ని నెలిమర్ల శాసన సభ్యురాలు శ్రీమతి లోకం నాగ మాధవి పింక్ బెలూన్స్ గాలిలో ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహనా నెలగా గుర్తించడం జరిగిందన్నారు.రొమ్ము క్యాన్సర్ తో మహిళలు ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పారు. మనల్లి పట్టి పిడిస్తున్న మహమ్మారి క్యాన్సర్ అని రోటరీ క్లబ్ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 50 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు మెమో గ్రామ్ స్క్రినింగ్ తప్పనిసరి చేశారన్నారు. భారత దేశంలో వాటిని ఎక్కువ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలన్నారు. ప్రజల్లో వర్క్ లైఫ్, హెల్త్ బ్యాలన్స్ సిస్టమ్ తప్పిందన్నారు. దానిపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలన్నారు. పోలియో మనం దేశంలోనికి రాకుండా చూసుకోవలసిన అవసరం ఉందన్నారు.
క్వాంటమ్ స్పెషలిటీ డయాగ్నస్టిక్స్, ఫౌండర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వేకల్ క్యాన్సర్ తో మహిళలు మృత్యువాత పడుతున్నారని చెప్పారు. ప్రివెన్షన్ తో వాటి బారిన పడకుండా ఉండవచ్చునని చెప్పారు ప్రజల్లో అవగాహనా కల్పించడమే వాక్ లక్ష్యం అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలు, కేజిహెచ్ గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐ. వాణి మాట్లాడుతూ రోగులకు ట్రీట్మెంట్ తో ఇవ్వడంతో పాటు సామాజిక బాధ్యత కూడా తమపై ఉందన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వేకల్ క్యాన్సర్ లను ముందుగానే గుర్తించి చికిత్స అందించ వచ్చున్నారు. మహిళలు పరీక్షలు చేయించుకోవడం ద్వారా వీటి బారిన పడకుండా ఉండవచ్చునన్నారు. కేజీహెచ్ లో ప్యాపస్మియర్, మెమెగ్రాప్ టెస్ట్ లను ఉచితంగా చేస్తున్నారని పేర్కొన్నారు
2015 కే పోలియో రహిత దేశంగా డిక్లర్ గా చేసుకున్నామని చెప్పారు.ఈ సందర్బంగా ఫ్లాష్ మాబ్ నిర్వహించారు
కార్యక్రమంలో జీసీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండి కల్పనా కుమారి, ఎండి డాక్టర్ సుస్మా, క్వాంటమ్ స్పెషలిటీ డయాగ్నస్టిక్స్ మేనేజర్ బీవీఎన్ రావు డీఎం రావు, దేవీ రావు, త్రినాధ్, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు