29-10.2024 న రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగే చలో విశాఖ డైరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
OSG NEWS SUNDAY 27.10.2024
విశాఖ డైరీ లో అవినీతిని అరికట్టాలని,సహకార యాక్టు 64 ద్వారా విశాఖ డైరీ ని నడపాలని, తగ్గించిన పాల ధరలు వెంటనే పెంచాలని, సంవత్సరానికి రెండుసార్లు బోనస్ ఇవ్వాలని, ఫీడ్ ధర వెంటనే తగ్గించాలని కోరుతూ ఏటికొప్పాక విశాఖ పాల డైరీ వద్ద పాల రైతులతో కలిసి రైతు మరియు సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్. శివాజి, రైతు సంఘం నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ డెయిరీ యాజమాన్యం ఆవు పాలు ధర తగ్గించిందని డెయిరీకి వచ్చిన లాభాలను డెయిరీ యాజమాన్యం ప్రతి సంవత్సరం వందలాది కోట్ల రూపాయలు వివిధ రూపాలలో అవినీతి, అక్రమాలు చేసి కాజేస్తున్నారని నష్టాలు డెయిరీకి చూపిస్తున్నారని ఆవు పాలు ధర తగ్గించి నందున పాల రైతులకు ప్రతి పేమెంటికి ఇంతవరకు వచ్చే ఆదాయంలో వేలాది రూపాయలు నష్టపోతున్నారు మరో ప్రక్క పశువుల దాణా, గడ్డి, మందులు, తదితర పెట్టుబడి పెరిగిపోతున్నదని ఆవు పాలు కనీస ఫాట్- 2.8 – ఎస్ఎన్ఎఫ్7.7వద్ద రూ 25.60 ఇచ్చేవారు ఇప్పుడు రూ 23.00 ఇస్తున్నారు,గరిష్ట ఫాట్-5.5 – ఎస్ఎన్ఎఫ్-8.8 వద్ద రూ 44.25 ఇచ్చేవారు రూ 40.30 తగ్గించారు అందువలన వల్ల లీటరు వద్ద పాల రైతు నష్టపోయేది (ఫాట్ను బట్టి)రు.2.60పై నుండి 4రు.లు వరకు ఉంటుందని కూరగాయలు నిత్యవసర ధరలు పెరిగిన ఈ సమయంలో ఆవు పాలు ధరలు విశాఖ డైరీ తగ్గించడం అంటే పాల రైతులు మెడలో ఉరితాడు బిగించడమేనని విశాఖ డెయిరీ పశువుల మందులుకు 30% రాయితీ ఇస్తున్నాం అంటున్నారు. మందుల ఏజెన్సీలు బల్కుగా తీసుకుంటే 30 నుండి 50% వరకు మార్జిన్తో ఇస్తాయి. అందులో కొనుగోలులో కూడా కమిషన్లు మేనేజ్ మెంట్ కాజేస్తుంది తప్ప డెయిరీ ఇచ్చింది ఏమీ లేదని సహకార నిబంధనల ప్రకారం లాభాలలో నుంచి బోనస్ 2006 సంవత్సరం నుండి ఇవ్వడంలేదని రైతు పాలకి ఇవ్వవలసిన డబ్బుల నుండి కొంత మినహాయించి ఆ డబ్బులనే బోనస్ గా ఇచ్చి రైతులను మోసగిస్తున్నారని అలాగే 250 కోట్లు పైగా రైతుల మూలధనం ద్వారా వచ్చిన లాభాలలో రైతులకు ప్రతి సంవత్సరం డివిడెంట్ రూపంలో ఇవ్వాలి, కానీ ఎప్పుడు కూడా విశాఖ డెయిరీ ఇవ్వలేదని కావున పై సమస్యలపై జరిగే ఈ నేల 29న జరిగే చలో విశాఖ డైరీ కార్యక్రమంకీ పాల రైతులు అందరూ వచ్చి విజయవంతం చేయాలనీ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఈశ్వరరావు పాల రైతులు నానీబాబు,అప్పారావు తదితరులు పాల్గున్నారు