తొలి రోజు ఇన్నింగ్స్ లో 295 పరుగులు చేసిన ఆంధ్ర
అద్భుతంగా ఆంధ్ర, హిమాచల్ రంజీ మ్యాచ్
విశాఖపట్నం osg news 26.10.2024
ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ గ్రూప్ బి రంజీ ట్రోఫీ మ్యాచ్ శనివారం విశాఖపట్నం పీఎం పాలెంలోని ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలి ఇన్నింగ్స్ మ్యాచ్ ఘనంగా ప్రారంభమయ్యింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి హిమాచల్ ప్రదేశ్ బౌలింగ్ ఎన్నుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు తొలి రోజు ఇన్నింగ్స్ లో గడిచిన 80 ఓవర్లకు 295 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. ముందుగా దిగిన ఓపెనర్ బ్యాట్సె్మన్లు అంతగా రాణించలేక తక్కువ పరుగులకే వికెట్ల కోల్పోయారు. మిడిల్ ఆర్డర్లో దిగిన కెప్టెన్ ఎస్.కె రషీద్ 132 బంతుల్లో 9 ఫోర్లుతో 69 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. జి హనుమ విహారి కూడా అద్భుతంగా రాణించి 115 బంతుల్లో 12 ఫోర్లతో 66 పరుగులు చేసి ఔటయ్యడు. తర్వాత దిగిన భారత క్రికెటర్ కె.ఎస్.భరత్ తన సొంత గడ్డపై విరిచిత ఆట తీరును ప్రదర్శించాడు. వన్డే తరహాలో కేవలం 39 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్స్‌లతో 65 పరుగులు చేసి దిగిన ముగ్గురు బ్యాట్సె్మన్లు కూడా అర్థ సెంచరీలు పూర్తి చేసి స్కోర్ ను ముందుకు నడిపించారు. తర్వాత దిగిన జి. మనీష్ 31, టి. విజయ్ లు 21 పరుగులు చేసి తొలి రోజు ఇన్నింగ్స్ ముగిసేసరికి నాటౌట్ గా బరిలో నిలిచారు. దీనితో ఆంధ్ర జట్టు తొలి రోజు 295 పరుగులు చేసి ఆరు వికెట్లు నష్టపోయింది.
బౌలింగ్ బరిలో హిమాచల్ ప్రదేశ్
బౌలింగ్ బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ దివేష్ ఆర్ శర్మ, కెప్టెన్ రిషి ఆర్ దావన్ లు తలోక రెండు వికెట్లు చొప్పున తీసుకున్నారు. అలాగే అర్పిత్,ముకుల్ లు తలోఒకటి వికెట్లు చొప్పున కైవసం చేసుకున్నారు.