అర్ధరాత్రి సమయం.. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బైపాస్ రోడ్డుపై వాహనాలు దూసుకుపోతున్నాయి. రోడ్డ పక్కన మొదట ఏదో కదిలినట్లు వాహనదారులకు కనిపించింది. అయితే లారీ డ్రైవర్లు, కార్ల యజమానులు పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. కొద్దిసేపటికే కలకలం రేగింది. ఏకంగా ఒక మొసలి బైపాస్ రోడ్డుపై ప్రత్యక్షమైంది. అటు ఇటు తిరుగుతూ దారిలో పోయే వాహనాలకు అడ్డు వచ్చింది. దీంతో మొదట వాహనదారులు కంగారు పడ్డా ఎవరూ దాన్ని తొక్కించకుండా పక్క నుండి వెళ్లిపోయారు. అయితే స్థానికలు ఈ విషయం తెలుసుకొని వెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.