మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు, నిందితుడికి 25 సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.21,000/- జరిమానా , బాధితురాలికి రూ.4,00,000/- నష్ట పరిహారంగా ఇవ్వాలని తీర్పు వెలువరించిన గౌరవ న్యాయస్థానం.
2023 సంవత్సరం నందు 9 సంవత్సరాల వయస్సు గల బాధిత బాలిక పొరుగున ఉన్న నిందితుడు ఇంటికి ఆటలకు వెళ్లి వచ్చేది, 24/08/23 న మధ్యాహ్నం 12:00 గంటలకు బాధిత బాలిక బయటకు వెళ్లగా, బాధితురాలి తల్లి బాలిక వాళ్ళ అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళిందని భావించారు, 26/08/23 న సాయంత్రం 06:00 గంటలకు ఇంటికి వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఆరా తీయగా, సదరు బాలిక పొరుగున ఉన్న నిందితుడు పోలరెడ్డి ఇంటికి వెళ్ళిందని, నిందితుడు పోలరెడ్డి అశ్లీల చిత్రాలు చూపించి, అసభ్యంగా తాకుతూ, అత్యాచారం చేశాడని తెలిపింది , పై విషయం పై తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగినది.
ఈ రోజు ఈ కేసులో విశాఖపట్నం గౌరవ స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి శ్రీ ఆనంది గారు, కంచర పాలెం పోలీస్ స్టేషన్ 376-A,B, 341 IPC, & Sec 5(l)(m) r/w 6 of POCSO Act, 7 Sec 3(2)(v) of SC & ST Act నందు విచారణ ముగిసిన తర్వాత నిందితుడు అలుగంటి పోచన్న కు 25 సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.21,000/- జరిమానా , బాధితురాలికి రూ.4,00,000/- నష్ట పరిహారంగా ఇవ్వాలని తీర్పు వెలువరించిన గౌరవ న్యాయస్థానం