OSG NEWS 29-10-2024
అక్కచెల్లెళ్ళయిన మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు, నిందితుడికి 25 సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.2,00000/- జరిమానా , బాధితురాలికి నిందితుడు రూ.1,00,000/- నష్ట పరిహారంగా, ప్రభుత్వం తరఫున బాధితురాలికి రూ. 3,00,000/- నష్ట పరిహారంగా ఇవ్వాలని తీర్పు వెలువరించిన గౌరవ న్యాయస్థానం.
2019 సంవత్సరం నందు వరుసగా 15 ,13 సంవత్సరాల వయస్సు గల అక్కచెల్లెళ్ళయిన బాధిత బాలికలను పొరుగున ఉన్న నిందితుడు అమరపల్లి అరవింద్ మాయమాటలు చెప్పి పలు మార్లు తన ఇంట్లో, పలు మార్లు బాధిత బాలికల ఇంట్లో అత్యాచారం చేశాడని , విషయం బయటకు చెబితే చంపేస్తానని బేదిరెంచేవాడని , బాధితురాలి తల్లి బాలికలను ఆరా తీయగా విషయం తెలియజేసారని , పై విషయం పై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగినది.
ఈ రోజు ఈ కేసులో విశాఖపట్నం గౌరవ స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి శ్రీ ఆనంది గారు, పెందుర్తి పోలీస్ స్టేషన్ Cr.no-545/2019 , 376,406,365,343,506 IPC & Sec 4 & 6 of POCSO Act నందు విచారణ ముగిసిన తర్వాత నిందితుడు అమరపల్లి అరవింద్ @ నాని కు 25 సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.2,00000/- జరిమానా , బాధితురాలికి నిందితుడు రూ.1,00,000/- నష్ట పరిహారంగా, ప్రభుత్వం తరఫున బాధితురాలికి రూ. 3,00,000/- నష్ట పరిహారంగా ఇవ్వాలని తీర్పు వెలువరించిన గౌరవ న్యాయస్థానం.
నగర పోలీస్ తరపున
విశాఖపట్నం సిటీ.