రండి… రారండి… టిడిపి సభ్యత్వం తీసుకోండి.!
– కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్
ఆనందపురం. OSGNEWS 25.10.2024
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆత్మగౌరవానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకని టిడిపి యువ నాయకుడు వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడే అందుకు బీజం వేశారని అదే స్ఫూర్తితో అన్నగారి ఆశయ సాధన కోసం అభివృద్ధి ప్రదాత అలుపెరగని పోరాట యోధుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారన్నారు. శనివారం నుండి జరగనున్న సభ్యత్వ నమోదులో పార్టీ అభిమానులు విరివిగా చేరాలని కోరారు. కేవలం 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే చనిపోయిన కార్యకర్తలకు పదివేల రూపాయలు మట్టి ఖర్చులు నిమిత్తం పార్టీ ఇస్తుందన్నారు. అలాగే సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు పెంచినఇన్సూరెన్స్ ద్వారా రెండు లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు వర్తిస్తుందన్నారు. కావున అధిక సంఖ్యలో ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకోవాలని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు.