డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళి
కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్
ఆనందపురం OSG NEWS 26-11-2024
బడుగు బలహీన వర్గాల జీవన విధానాన్ని మెరుగుపరిచేలా రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించారని వేముల వలస పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్అన్నారు. స్థానిక ఎంపీపీ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1949 నవంబర్ 26న అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి రూపొందించారని తద్వారా అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిన మహనీయులని కొనియాడారు. ముఖ్యంగా యువత రాజ్యాంగానికి అనుకూలంగా జీవన విధానాన్ని మార్పు చేసుకోవాలన్నారు. సౌబ్ర తత్వం, సార్వభౌమత్వం, లౌకికత్వం, ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయంతో రాజ్యాంగం ముడిపడి ఉందని అందుకు అందరూ అంబేద్కర్ కు రుణపడి ఉండాల్సి ఉందన్నారు. రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం గా భావించాలని కోరారు. ఈ సందర్భంగా కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. భారత రాజ్యాంగం కోసం విశదీకరించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు కె. సుభాషిణి, కె. పద్మావతిపాల్గొన్నారు.