ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలంలో ఆక్రమంగా ఉంటున్న వారిపై రెవెన్యూ అధికారులు ఉక్కు పాదం మోపారు. వివరాల్లోకెళ్తే జట్లమ్మకొండ సర్వేనెంబర్ 276 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, జిల్లా సైనిక బోర్డుకు, ఎక్సైజ్ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో కొందరు అక్రమార్కులు బాగా వేశారు. నోటీసుల ఇచ్చినప్పటికీ వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్కు స్థానిక తాసిల్దార్ శ్యాం ప్రసాద్ సమాచారం అందించడంతో వెంటనే ప్రభుత్వ స్థలాన్ని స్వాధీన పరచుకోవాలని ఆదేశాలతో ముందస్తు జాగ్రత్తబుధవారం ఉదయం పోలీసులు సహాయంతో ప్రభుత్వ స్థలంలో బాగా వేసిన వారిని ఎంకరోజ్మెంట్ నోటీసు ప్రకారం ఖాళీ చేయించారు. అయితే గతంలో ఈ స్థలంలో ఉన్న కబ్జాదారులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయించినప్పటికీ జూనియర్ కళాశాల స్థలాన్ని ఆక్రమించారని ప్రభుత్వం పేద ప్రజలకు విద్యా విధానం చేస్తున్న స్థలాన్ని కబ్జా చేయడం దారుణమని తెలిపారు. ఈ సందర్భంగా మండల తాసిల్దార్
పేర్లి శ్యాంప్రసాద్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆక్రమదారులు ఎవరైనా ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ స్థలానికి హద్దులు వేసిపూర్తిస్థాయి గోడను నిర్మిస్తామని, ప్రస్తుతం ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం పై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆర్థిక వనరులు చేకూర్చి రెవెన్యూ అధికారులు బాసటగా ప్రభుత్వాలు పనిచేయాలని అలాంటప్పుడే రెవెన్యూ అధికారులు సక్రమంగా పనులను నిర్వర్తించడానికి అనుకూలంగా ఉంటుందని ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు.