OSG NEWS 15-11-2024
విశాఖపట్నం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఆనందపురం మండలం గుడిలోవ గ్రామంలో వేంచేసియున్న శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం యొక్క కోట్లాది రూపాయల విలువైనభూమి సర్వే నంబర్ 69 లో 26 ఎకరాల 25 సెంట్లు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులు ప్రకారము ఈరోజు స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడమైనది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి టి అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది శ్రీ ఎన్ వి ఎస్ ప్రసాద్ వర్మ గారు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం శ్రీధర్, దేవాలయ కార్య నిర్వహణ అధికారి శ్రీఎస్ నానాజీ బాబు, తదితరులు హాజరయ్యారు.