OSG NEWS

ఎస్వీఎల్ఎన్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత ప్రభుత్వం కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ,నెహ్రూ యువ కేంద్రం విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో నేడు జాతీయ రహదారి భద్రత మాసోత్సవం లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ బుచ్చి రాజుగారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విశాఖపట్నం వారు రహదారి భద్రత పట్ల అవగాహన కలిగించి భారత దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అధిక వేగం వలన జరుగుతున్నాయని విద్యార్థులు యువత రోడ్డు ప్రమాదాల మీద అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి విషయాలను అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ లీలాప్రసాద్ ఫౌండర్ ప్రెసిడెంట్ సమస్రయ ఫౌండేషన్ విశాఖపట్నం, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి సహదేవుడు,ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ శ్రీ బి ప్రసాదరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. ఎస్ .అప్పలనాయుడు, ఇతర అధ్యాపకులు భోదనేతర సిబ్బంది విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *