యువగళం రాష్ట్రంలో పెనుమార్పులకు శ్రీకారం
టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
భీమిలి OSG NEWS 27-01-2025
వైసిపీ ఆరాచక పాలనపై సమరశంఖం పూరించి చేపట్టిన నారా లోకేష్ పాదయాత్ర రాష్ట్రంలో రాజకీయ పెనుమార్పులకు శ్రీకారం చుట్టిందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, రాష్ట్ర ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్బంగా గంటా నూకరాజు భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2023 జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర 11 ఉమ్మడి జిల్లాలో, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2097 గ్రామాల మీదుగా, 226 రోజులపాటు, 3,132 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర దేశంలోనే ఒక సంచలమని అన్నారు. యువగళం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గంలో 90 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారంటే పాదయాత్ర ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుందని అన్నారు. 226 రోజుల పాదయాత్రలో సుమారుగా కోటిన్నర మందిని లోకేష్ కలిశారని అన్నారు. గత వైసిపీ ప్రభుత్వంలో పడిన ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ, ఎంతోమందికి భరోసా ఇస్తూ, ఎండనక, వాననక, తుఫానులను సైతం లెక్కచేయక సుదీర్ఘ పాదయాత్ర చేశారని అన్నారు. నారా లోకేష్ ఏ హామీలైతే నాడు ప్రజలకు ఇచ్చారో వాటిని అమలు చేయడంలో సంసిద్దులయ్యారని అన్నారు. పాదయాత్ర ప్రభావంతో ఆరాచక వైసిపీని కూకటి వేళ్ళతో పెకిలించారని అన్నారు. లోకేష్ హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే డిఎస్సీ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారని అన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. తొలి ఏడు నెలల కాలంలో 6.33 లక్షల పెట్టుబడులు వివిధ పరిశ్రమల ద్వారా వచ్చి 4 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని అన్నారు. దటీజ్ లోకేష్, దటీజ్ కూటమి ప్రభుత్వమని గంటా నూకరాజు అన్నారు.