OSG NEWS

30,31 తేదీల్లో విశాఖలో సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు

విజయసాయిరెడ్డి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి

విశాఖపట్నం OSG NEWS 28-01-2025

రాజకీయాలను వదిలేసినంత మాత్రాన మాజీ ఎంపి విజయసాయి రెడ్డి చేసిన అక్రమాలు మాయం అవ్వపని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని విజయసాయి రెడ్డి చేసిన అడ్డుగోలు వ్యవహారాలు అన్నిటిపై హైకోర్టు సిటింగు జడ్జి నేత్రత్వంలో విచారణ జరపాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

మంగళవారం నగరంలో అల్లిపురంలోని సిపిఐ జిల్లా కార్యాలయం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యనారాయణ మూర్తి మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విజయసాయి రెడ్డి చేసిన అక్రమాలు, ఆగడాల కారణంగా విశాఖ నగరం బ్రాండ్ ఇమేజి మసక బారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రతిపక్షంలో ఉండాగా విజయసాయి రెడ్డి అక్రమాలపై సుప్రీంకోర్టుకు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారని, ఇపుడు అధికారంలోకి వచ్చి ఏరు నెలలు అయినా ఎందుకు విచారణకి ఆదేశాలు ఇవ్వలేక పోతున్నారు అని నిలదీశారు. విజయసాయి రెడ్డి పై టీడీపీ నేతలు గతంలో చేసిన ఆరోపణల్లో నిజాలు ఇప్పుడు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి పై చేసిన ఆరోపణలపై ఇప్పటికీ తగిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండు చేశారు.

అక్రమాలకు పాల్పడి, రాష్ట్రాన్ని దోచేసిన విజయసాయి వంటి వారి పేర్లు రెడ్ బుక్ లో రాసుకోలేదా అని మంత్రి నారా లోకేష్ ను నిలదీశారు. విజయసాయి అక్రమాలపై ఎందుకు విచారణకు ఆదేశాలు ఇవ్వడం లేదో జనసేన అధినేత, ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేసినంత మాత్రాన విజయసాయి రెడ్డి చేసిన అక్రమాలు అన్ని సక్రమాలు కావని కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు.

విజయసాయి రెడ్డి విశాఖపట్నం జిల్లా కేంద్రంగానే భారీగా అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇందులో విశాఖపట్నం నగరం నడిబొడ్డున దస్పల్లా భూములకు 22 ఏ ను రద్దు చేసి తన బందువులకు కట్టబెట్టేలా చేసిన కుట్ర వ్యవహరంపై సమగ్ర విచారణ జరపాలని పేర్కొన్నారు.

విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కార్తీకవనం భూములను అధికార బలంతో లాగేసుకొని రాడిసన్ బ్లూ హెూటల్ కట్టించిన వ్యవహారంపై విచారణ జరపాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొన్నారు. కార్తీక వనం ఎదురుగా ఉన్న కొండపైన బేపార్కు హెూటల్ కూడా తన బందువులకు దక్కేలా చేసిన అక్రమ వ్యవహారం పైనా విచారణ చేపట్టాలని డిమాండు చేశారు.

భీమిలి మండలంలోని కావులుప్పొడ దగ్గర 100 ఎకరాల భూమి దోపిడీ పైనా విచారణ జరపాలన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన కోసం రాజప్రాసాదం కట్టుకోవడం కోసం ఋషికొండలో జరిపిన విధ్వంసం లో భాగంగా జరిపిన తవ్వకాల్లో పెద్దఎత్తున గ్రావెల్, రాయిని విజయసాయి రెడ్డి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణపై కూడా విచారణ జరపించాలి అని డిమాండు చేశారు.
విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం మండలం తరువాడ పంచాయతీ లో సర్వే నెం 1 లో తన కుమార్తె నిర్వహణలో అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వ విద్యాలయం కడతామని 120 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసినట్టు వచ్చిన ఆరోపణలపైనా విచారణ చేపట్టాలని డిమాండు చేశారు. విజయసాయి అక్రమాల్లో ఇవి కొన్ని మాత్రమేనని, అధికారాన్ని అర్ధం పెట్టుకొని వ్యాప్తంగా ఈ తరహా అక్రమాలతో వేల కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయాలను వదిలేసారు. కదా ఇక ఆయనపై ఏ చర్యలు ఉండవేమో అనే చర్చ ప్రజల్లో జరుగుతున్నదని పేర్కొన్నారు. రాజకీయాలను, అధికారాన్ని అద్దం పెట్టుకొని విజయసాయి అక్రమాలపై సమగ్ర విచారణ జరుపకపోతే కూటమి ప్రభుత్వ పెద్దలకి అందులో భాగ స్వామ్యం ఉండని భావించే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా చిత్త శుద్ధితో విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండు చేశారు.

రాష్ట్రంలోని యూనివర్సిటీల ఉపకులపతుల నియామక ప్రక్రియలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోండని పేర్కొన్నారు. ఉపకులపతుల నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చి నెలలు గడచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపకులపతులుగా వది చేసే సామర్థ్యం ఎవ్వరికీ లేదనే రీతిలో ప్రభుత్వ పెద్దలే లీకులు ఇస్తూ చిన్న చిన్న సంస్థల్లో పని చేస్తున్న తమ అనుంగులకు ఉపకులపతుల పోస్టింగులు ఇవ్వాలని చూస్తున్నట్టు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండు చేశారు. ఒక ప్రైవేటు యూనివర్సిటీ యజమాని చెప్పినట్టు విద్యాశాఖ మంత్రి అడుతున్నట్టు వర్సిటీల్లోనే పెద్ద చర్చ జరుగుతున్నదని పేర్కొన్నారు. ఉపకులపతుల నియామకం కోసం ఏర్పాటైన సెర్చి కమిటీలో ఒకే ప్రైవేటు యూనివర్సిటీకి చెందిన 7 మంది ఆచార్యులు ఉన్నారంటే ప్రభుత్వ ఆలోచనా సరళి అర్ధమవుతోందని విమర్శించారు. రాష్ట్రంలో వందల మంది సీనియర్ ఆచార్యులు ఉన్నారని వారిని కాదని తాము చెప్పింది చేసే వ్యక్తులను ఉపకులపతులుగా నియమించాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అర్హతలు లేని వ్యక్తులకు ఉపకులపతుల పోస్టులు కట్టబెట్టనున్నట్టు జరుగుతున్న ప్రచారంపైనా ప్రభుత్వ పెద్దలు స్పందించాలని డిమాండు చేశారు. నియామకాలు లేక ఇప్పటికే కూనరిల్లుతున్న వర్సిటీలను గాడిన పెట్టడం మరని తమ రాజకీయాల కోసం వాడుకోవాలనుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఉ పకులపతుల నియామకాలపై వస్తున్న అన్ని ఆరోపణలకు సమాధానం చెప్పడంతో పాటు సరైన రీతిలో చర్యలు చేపట్టాలని డిమాండు. చేశారు.

విశాఖలో సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 30, 31 తేదీల్లో విశాఖపట్నం నగరంలో జరుగుతాయని సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఈ సమావేశాలకు దేశం నలుమూల నుంచి పార్టీ కీలక నేతలు అందరూ హాజరు అవుతారని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పాలన, వివిధ రంగాల పరిస్థితిపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన చేయనున్నట్టు వివరించారు. సిపిఐ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో 29 వ తేది సాయంత్రం 5 గంటలకు నగరంలో పౌర గ్రంధాలయంలో ఆధునిక భారత నిర్మాణంలో సిపిఐ పాత్ర భవిష్యత్తు సవాళ్లు అనే అంశంపై ప్రత్యేక నదస్సు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ సదస్సులో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రసంగిస్తారని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *