ఎంపీడీవో ఆఫీసు నందు పంచాయతీ అభివృద్ధిపై శిక్షణా తరగతులు
OSG NEWS 14-11-2024
ఆనందపురం గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ డాక్టర్ వి .జానకి ఆధ్వర్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ , సర్పంచ్ ఒకరోజు జీపీడీపీ (గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ), బీపీడీపీ (బ్లాక్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ )పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ ట్రైనింగ్ ద్వారా గ్రామ పంచాయతీ లో 2025-26 సంవత్సరానికి నిధులు సమీకరణ, ప్రణాళిక తయారుచేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు సుస్థిర అభివృద్ధి ప్రణాళిక చేయుటకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని, ఈ ట్రైనింగ్ తరగతులను పంచాయతీ కార్యదర్శుల ధనుంజయ్,శ్రీరామ్ మూర్తి, కంప్యూటర్ ఆపరేటర్ డివిఎస్ఎన్ మూర్తి ద్వారా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు గ్రామపంచాయతీ అభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కోరాడ వెంకట్రావు, ఎంపీపీ మజ్జి శారదా ప్రియాంక, నాయకులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.