యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేస్తా ఎన్డీయే ప్రభుత్వం 7 నెలల్లో రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు, 4.10 లక్షల ఉద్యోగాలు స్థిరమైన ప్రభుత్వం వల్లే పెట్టుబడులు! వైసీపీపై ఆ పార్టీ నాయకులకు నమ్మకం లేదు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు 5 ఏళ్లలో విశాఖలో 5లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు! విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వబోమనే హామీకి కట్టుబడి ఉన్నాం సాక్షి పత్రికపై పరువునష్టం కేసులో ఆలస్యమైనా నిజం గెలుస్తుంది! విశాఖలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్

Byadmin

Jan 27, 2025
OSG NEWS

యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా

పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేస్తా

ఎన్డీయే ప్రభుత్వం 7 నెలల్లో రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు, 4.10 లక్షల ఉద్యోగాలు

స్థిరమైన ప్రభుత్వం వల్లే పెట్టుబడులు!

వైసీపీపై ఆ పార్టీ నాయకులకు నమ్మకం లేదు

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

5 ఏళ్లలో విశాఖలో 5లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వబోమనే హామీకి కట్టుబడి ఉన్నాం

సాక్షి పత్రికపై పరువునష్టం కేసులో ఆలస్యమైనా నిజం గెలుస్తుంది!

విశాఖలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం: OSG NEWS 27-01-2025

యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో సాక్షి తరపు న్యాయవాది కోర్టుకు హాజరుకాకపోవడంతో విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 2019లో బ్లూమీడియా పత్రిక సాక్షిలో నాపై అసత్య కథనాలతో వార్త ప్రచురించారు. నేను మంత్రిగా ఉన్న సమయంలో చిరుతిళ్లకు రూ.25లక్షలు ఖర్చుపెట్టారని దుష్ప్రచారం చేశారు. నేను లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆధారాలు లేకుండా వార్త ప్రచురించారని, నా పరువుకు భంగం కలిగిందని, క్షమాపణలు చెప్పాలని, పత్రికలో వివరణ ఇవ్వాలని నేను డిమాండ్ చేశాను. ద వీక్ పత్రిక క్షమాపణ చెబుతూ రీజాయిండర్ కూడా ఇచ్చారు. సాక్షి పత్రిక మాత్రం పదేపదే అబద్దాలు చెబుతూ దానిని నిజం చేయాలని చూస్తోంది. అందుకే ఐదేళ్ళుగా న్యాయ పోరాటం చేస్తున్నాను. ఎన్నిసార్లైనా నేను కోర్టుకు వస్తా. మంత్రి హోదాలో వచ్చిన నేను పార్టీ ఆపీసులో బస్సులో నిద్రించి, నా సొంత డబ్బునే ఖర్చుచేస్తున్నాను. ఒక్క వాటర్ బాటిల్ కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవడం లేదు. ప్రభుత్వంపై ఆధారపడకూడదని నా తల్లి నేర్పించారు. ఈ కేసును లాజికల్ ఎండ్ కు తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదా వేసినా వస్తాను. ఎందుకంటే నేను తప్పుచేయలేదు. ఆలస్యమైనా నిజం గెలుస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను.

యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా

నేను స్టాన్ ఫోర్డ్ లో ఎంబీయే చేశా. వై స్టాన్ ఫోర్ట్ ఎంబీయే అనే ప్రశ్న ఉంటుంది. ప్రైవేటు రంగం నుంచి ఏదో ఒక సమయంలో రాజకీయాల్లోకి వస్తాను, అందుకే స్టాన్ ఫోర్డ్ ఎంబీయే ప్రిఫర్ చేస్తున్నాని చెప్పాను. తర్వాత నాకు అర్థం అయింది ఏంటంటే స్టాన్ ఫోర్డ్ ఎంబీయే బిజినెస్ కు మంచిదని, పాదయాత్ర రాజకీయం కోసం. రాజకీయాల్లో ఎంబీయే పాదయాత్ర. ప్రజలకు దగ్గరంగా ఉంటాం. ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నాం. యువగళం పాదయాత్రలో ఒక్కో హామీని నిలబెట్టుకుంటున్నాం. ఇచ్చిన ప్రతిహామీ నిలబెట్టుకుంటాం. యువగళం పాదయాత్ర తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలనేది నా కోరిక. అందుకే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నా. వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం.

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

తల్లి, చెల్లిపైనే జగన్ రెడ్డికి నమ్మకం లేదు. ఇక పార్టీలో ఉన్న నాయకులకు ఏం నమ్మకం ఉంటుంది? డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తారు. అది నిజం అవుతోంది. వైసీపీలో ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన నేతలు, అధికారులను వదిలిపెట్టేదిలేదు. దర్యాప్తు జరుగుతోంది. జరగనివ్వండి, త్వరలోనే అన్ని బయటకు వస్తాయని భావిస్తున్నా. కాకినాడ పోర్టును అడ్డగోలుగా, తుపాకీ పెట్టి లాక్కున్నారు. రూపాయిని ఆరుపైసలు పెట్టి విజయసాయిరెడ్డి కొట్టేశారు. కేసు పెట్టడం జరిగింది. ఈడీ కూడా విచారిస్తోంది. విశాఖలో భూకబ్జాలపైనా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ అక్రమాలపై ఒకేసారి దర్యాప్తు చేస్తే లా అండ్ ఆర్డర్ కు ఇక పోలీసులు ఉండరు. గాలి కూడా అమ్మేశారు. విచారణ పకడ్బందీగా చేయాల్సి ఉంది. ఒక్కొక్కటిగా చేస్తున్నాం. ఇది కక్షసాధింపు కాదు.

ఎన్డీయే ప్రభుత్వం 7 నెలల్లో రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు, 4.10 లక్షల ఉద్యోగాలు

అమర్ నాథ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దావోస్ నుంచి ఎన్ని పెట్టుబడులు తీసుకువచ్చారో చెప్పాలి? ఎన్డీయే ప్రభుత్వం 7 నెలల్లో రూ.6,33,568 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చింది. 4,10,128 మందికి ఉద్యోగాలు వస్తాయి. బాబు గారు 1997 నుంచి దావోస్ కు వెళ్తున్నారు. దావోస్ లో ఎప్పుడూ ఒప్పందాలు చేసుకోరు. చర్చిస్తాం. వారి ఆసక్తిని బట్టి ఒప్పందాలు చేసుకుంటాం. ఆర్సెల్లెర్ మిట్టల్ తో మేం ఒప్పందం చేసుకోలేదు. ఎంవోయూ ఎందుకు.. డైరెక్ట్ గా వర్క్ లోకి వెళ్దామని వారు చెప్పారు. దీనికి మమ్మల్ని తప్పుబడతారా? వారిని అన్ని అనుమతులు ఇచ్చాం. భూమి కేటాయింపులు చేస్తాం. 6,7 నెలల్లో పనులు ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తాం. ఇవన్నీ వైసీపీ హయాంలోనే వస్తే ఎందుకు శంకుస్థాపనలు చేయలేదు? వైఎస్ వల్లే కియా మోటార్స్ వచ్చిందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. టీసీఎస్ క్రెడిట్ తీసుకునేందుకు కూడా ప్రయత్నించారు. నేను వెళ్లి మాట్లాడి టీసీఎస్ తీసుకువచ్చా.

స్థిరమైన ప్రభుత్వం వల్లే పెట్టుబడులు వస్తాయి

మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్ల వారికి పెట్టుబడులు వస్తున్నాయి. స్థిరమైన ప్రభుత్వం వల్ల పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసం నెలకొంటుంది. గతంలో దావోస్ లో జగన్ రెడ్డిని కలిసేందుకు ఓ పారిశ్రామికవేత్త ప్రయత్నిస్తే కలవబోమని చెప్పారని, టీడీపీ హయాంలో పెట్టుబడులు పెట్టడమే కారణమని సదరు వ్యక్తి చెప్పారు. అది వరల్డ్ రినోంట్ కంపెనీ. కనీసం వారి సమస్యలు పరిష్కరించేందుకు కూడా జగన్ రెడ్డి కాని, పరిశ్రమల మంత్రి కానీ కలవలేదు. నేను మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సారి ఐటీ కంపెనీలతో సమావేశం పెట్టాను. ప్రజలు కూడా ఆలోచించాలి. గుజరాత్ లో ఐదుసార్లు ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల, మహారాష్ట్రలో కూడా అదే ప్రభుత్వం రావడం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. 2014 నుంచి 2019వరకు స్పీడ్ గా వెళ్లాం. తర్వాత బ్రేక్ పడింది. పీపీయేలను రద్దు చేశారు. ఒక రాజధాని కాదు.. మూడు రాజధానులని గేమ్ ఆడారు. దీనివల్ల ఏపీ ప్రజలు నష్టపోయారు. ప్రజలందరూ దీనిని గమనించాలి. మోడీగారు కానీ, సీఎం గానీ, నేను కానీ మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం గెలవాల్సిన అవసరం ఉందని చెబుతున్నాం. జగన్ రెడ్డి మళ్లీ రాడని గ్యారంటీ అడుగుతున్నారు. అమర్ రాజా బ్యాటరీని ఎంతగా ఇబ్బంది పెట్టారో మనం చూశాం. ఏపీలోనే హయ్యస్ట్ టాక్స్ పేయర్ అమర్ రాజా. జగన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి వేధించారు. అమర్ రాజా బ్యాటరీ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వారిని ఇబ్బందిపెట్టారు. ఇంకెవరొస్తారు?

ఆర్కే రోజాకు దావోస్ కు, జ్యూరిచ్ కు తేడా తెలియదు

ఒక్కో పారిశ్రామికవేత్తను ఒప్పించడానికి కష్టపడాల్సి వస్తోంది. కాగ్నిజెంట్ ను వారి పెవిలియన్ కు వెళ్లి కలిశాను. మన పిల్లల కోసం వెళ్లాను. త్వరలోనే విశాఖ, ఉత్తరాంధ్రకు మంచి న్యూస్ వస్తుంది. ఆర్కే రోజాకు దావోస్ కు, జ్యూరిచ్ కు తేడా తెలియదు. జ్యూరిచ్ లో తెలుగువారితో సమావేశమయినప్పుడు ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రెడ్ బుక్ గురించి మాట్లాడాను. దావోస్ లో మాట్లాడలేదు. రెడ్ బుక్ గురించి ఎందుకు వారికంత భయం?

టీసీఎస్ 90 రోజుల్లో వస్తుంది

విశాఖలో టీసీఎస్ కు కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పించడం జరిగింది. రాయితీలు కూడా త్వరలోనే విడుదల చేస్తాం. త్వరలోనే భూములు కూడా కేటాయిస్తాం. సమస్యలు ఏమైనా వాట్సాప్ ద్వారా పరిష్కరిస్తా. 90 రోజుల్లో టీసీఎస్ వస్తుంది. టెంపరరీగా ప్రారంభిస్తారు. బిల్డింగ్ కట్టేందుకు 2,3 ఏళ్లు పడుతుంది. 5 ఏళ్లలో విశాఖలో 5లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం. 2014 నుంచి 19 వరకు ఎందుకోగానీ ఒక రెసిస్టెన్సీ ఉంది. ఇప్పుడు చాలా పాజిటివ్ గా ఉన్నారు. ఐటీ రంగంలో ఇప్పుడు నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ వచ్చాయి. వీటిని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాం. ఇందులో భాగంగానే డేటా సిటీ గురించి చర్చించాం. ఇన్ఫోసిస్ వాళ్లు క్యాంపస్ వెతుకుతున్నారు. విప్రో వాళ్లు విస్తరణకు చూస్తున్నారు. టాప్ 100 కంపెనీలతో మేం మాట్లాడుతున్నాం. జీసీసీ(గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) ఏర్పాటుకు కూడా కృషిచేస్తున్నాం. మొదటి 500 కంపెనీలకు దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకు భూములు ఇస్తామని దావోస్ లో హామీ ఇచ్చాను. గతంలో హెచ్ సీఎల్ కు కూడా ఇదే విధంగా ఇచ్చాం. ఇప్పుడు విస్తరణ దిశగా వెళ్తున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ లకు సహకారం అందిస్తాం. పాయకరావుపేట-తుని ఎయిర్ పోర్ట్ పై కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడాల్సి ఉంది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వబోమనే హామీకి కట్టుబడి ఉన్నాం

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వబోమనే హామీకి కట్టుబడి ఉన్నాం. ఎన్డీయే ప్రభుత్వం, ప్రజల దయ వల్ల మేం మాట్లాడగలుగుతున్నాం. దేశంలో అనేక ఉక్కు పరిశ్రమలు ప్రైవేటీకరణ జరుగుతుంటే విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం. ప్రజలిచ్చిన తీర్పు వల్లే ఇది సాధ్యమైంది. 7 నెలల్లో స్టెబిలిటీ కోసం రూ.1600 కోట్లు ఖర్టు పెట్టాం. ఇప్పుడు కేంద్రం నుంచి రూ.11వేల కోట్ల నిధులు తీసుకువచ్చాం. ఏపీ నుంచి రూ.2,500 కోట్లు ఇస్తున్నాం. గతంలో వాజ్ పేయి గారు రూ.1300 కోట్లు ఇచ్చారు. దేశం కోసం మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఈక్విటీ రూపంలో వస్తోంది. కష్టపడి దేశానికి తిరిగి చెల్లిద్దామని కోరుతున్నాం. కేప్టివ్ మైన్స్ అర్థంలేని వాదన. కేప్టివ్ మైన్స్ లేకుండానే ఎమ్ఎన్ డీసీతో టై అప్ అయి ఆర్సెల్లెర్ మిట్టల్ పెట్టుబడులు పెడుతోంది కదా. కొంతమంది సీఈవోల వల్ల ఇబ్బందులు వచ్చాయి. పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కును సెట్ చేస్తాం. లాభాల్లోకి తీసుకువస్తాం. నేను హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీల్ నే వాడా. ఇప్పుడు అమరావతిలో కూడా విశాఖ స్టీల్ నే వినియోగిస్తాం.

విద్యార్థులను ఇబ్బంది పెట్టే కాలేజీ యాజమాన్యాలపై చర్యలు

ప్రజల కోసం 3 నెలల్లో రుషికొండ భవనాలను ఓపెన్ చేస్తాం. విద్యాదీవెన విషయంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదు. డైరెక్టుగా కాలేజీల యాజమాన్యాలకే నిధులు చెల్లిస్తాం. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. లింకింగ్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. త్వరలోనే నిధులు విడుదల చేస్తాం. విద్యార్థులను ఇబ్బంది పెట్టే కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టింది. మేం చెల్లిస్తాం.

పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేస్తా

నన్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే చూడండి. చంద్రబాబు ఏ బాధ్యతలు ఇచ్చినా అహర్నిశలు కష్టపడి పనిచేస్తా. పార్టీని బలోపేతం చేస్తా. పార్టీకి చెడ్డపేరు మాత్రం తీసుకురాను. పాదయాత్ర చేశాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేస్తా. ఒక వ్యక్తి మూడుసార్లు కంటే ఒక పదవిలో ఉండకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను కూడా ఈ సారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండకూడదని భావిస్తున్నా. గ్రామపార్టీ నుంచి పొలిట్ బ్యూరో వరకు పార్టీలో మూమెంట్ రావాలని, దీనిపై పెద్దలు నిర్ణయిస్తారని మంత్రి లోకేష్ చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *