వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి
గుంటూరులో 26న మాల మహా గర్జన
అఖిల భారత మాల సంఘాల జె.ఎ.సి చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్
OSG NEWS 01.11.2024
విశాఖపట్నం : రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాల మహాగర్జన నిర్వహిస్తున్నట్టు అఖిల భారత మాల సంఘాల జె.ఎ.సి చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ చెప్పారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల మాల సంఘాల ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ ఎదురు బైబిల్ మిషన్ మైదానంలో ఈ నెల 26వ తేదీన మాల మహా గర్జన జరుగుతుందన్నారు. మాలల సామాజక స్పందన ప్రభుత్వానికి తెలియచేప్పాలన్నదే గర్జన లక్ష్యం అన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అనుసరించి వర్గీకరణ చట్టాన్ని ప్రభుత్వం చేయరాదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ శాసనం కాదని శాసన సభ మాత్రమే శాసనం చేయాలన్నారు. సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించిందని దాన్ని చట్టం చేయమని ఆర్డర్ ఇచ్చే అధికారం సుప్రీం కోర్టుకు లేదన్నారు. సుప్రీం కోర్టు గతంలో ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం వర్గీకరణ రాజ్యాంగ విరుద్దమని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూలను డిస్టర్బ్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని అది కేంద్రం మాత్రమే చేయాలన్నారు. కేంద్రం చేయలంటే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. రాష్ట్రంలో మాల సమూహం పెద్దది అని 57లక్షల మంది ఓటర్లు వున్నారని వారు 27 లక్షలు మాత్రమే వున్నారని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు వర్గీకరణ పై ఇచ్చిన తీర్పు కు వ్యతిరేకంగా మాలల అందరు ఐక్యతతో పోరాడుతున్నారని తీర్పును రద్దు చేయాలని కోరారు.మాదిగలు ఒక్కరే వర్గీకరణ కోరుకుంటున్నారని చెప్పారు.
మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ ఎం నాగమల్లేశ్వరి మాట్లాడుతూ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోరుతూ గుంటూరులో లక్షలాది మాలలతో మహా గర్జన చేస్తున్నట్టు చెప్పారు. అంబేద్కర్ ఆలోచన, అశయానికి అనుగుణంగా అయన వారసులుగా ముందుకు వచ్చి వర్గీకరణ ను అడ్డుకుంటామన్నారు
ఇప్పుడు వున్న రాజకీయ పార్టీలు తమకు నచ్చినప్పుడు వర్గీకరణ చేయడం, వద్దు అనుకుంటే వర్గీకరణ ఆపడం చేస్తున్నాయిని మండిపడ్డారు. దళితులు అంటే రాజకీయ పార్టీలకు చులకనగా ఉందన్నారు 59 ఉపకులాలు వున్నాయిని అందులో ఒక ఉప కులం అడిగిందని తమను విడదీసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రాజ్యాంగంలో వున్న తమ హక్కులను కాలరాయాలని చుస్తే తిరగబడతామని హెచ్చరించారు. మాల మేధావులు, మాల రాజకీయ నాయకులు మాల ఉద్యోగులు, అంబేడ్కర్ వాదులు, మాల విద్యార్థులు మాల ఉద్యమకారులు లక్షలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.