బాణసంచా దుకాణదారులు పలు జాగ్రత్తలు వహించాలి ……
మండల పరిధిలో 10 దుకాణాలు కేటాయింపు
సి ఐ చింత.వాసు నాయుడు
osg news 29-10-2024
రానున్న దీపావళి నేపథ్యంలో బాణసంచా విక్రయాల్లో నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆనందపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చింత వాసు నాయుడు అన్నారు. సోమ వారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బాణసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ,
మండలంలో 10 మంది బాణాసంచా అమ్మకాలకు దరఖాస్తులు చేసుకున్నారన్నారు.
బోయపాలెంలో 4, ఆనందపురంలో 6 గురు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. వారికి ఈ ప్రదేశాల్లో అమ్మకాలకు అనుకూలంగా
ఆనందపురంలో బీపీ కల్లాలు రోడ్డు శుభశ్రీ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఖాళీ స్థలంలో బాణాసంచా విక్రయాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
బోయపాలెం బ్రిడ్జి సమీపంలో జన సమూహం లేని అమ్మకాలు సాగించాలన్నారు.
‘ఎక్కడా బాణసంచా పేలుళ్లు జరగకుండా ప్రశాంతంగా దీపావళి చేసుకునేలా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. బాణసంచా విక్రయాల
సమయంలో వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామగ్రి భద్రపరిచిన గొడౌన్లు, దుకాణాల వద్ద భద్రతా
ప్రమాణాలు పాటించాలన్నారు. ఇసుక, ఫైర్ ఇంజిన్ తప్పని సరిగా అందు బాటులో ఉంచాల న్నారు.ఒక్కో దుకాణానికి 5 నుంచి 10 అడుగుల దూరం పాటించాలని, పరిమితికి మించి మందుగుండు సామాగ్రిని నిల్వ ఉంచకూడదని పేర్కొన్నారు.