కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశలలో విశాఖకు చెందిన కాంగ్రెస్ నాయకులు జగన్ మురారి మాట్లాడుతూ. విశాఖకు టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు చేసింది ఏమి లేదని.రెండు పార్టీల నుండి మెజారిటీ ప్రజా ప్రతినిధులు ఇతర జిల్లాల నుండి వచ్చి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై ఆస్తులు సంపాదించుకున్నారే తప్పా విశాఖకు చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే విమ్స్, బి ఆర్ టి ఎస్ రోడ్లు, కోస్టల్ కరిడోర్, ఏపీ సెజ్ వంటివి ఎన్నో వచ్చాయని టీడీపీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక చెప్పుకునే అంత అభివృద్ధి ఏమి చేయలేదని ఆయన అన్నారు. రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు ప్రవేశ పెట్టి పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దని, టీడీపీ, వైసీపీ హయాంలో ఎంతమంది పేదలకు ఇళ్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.స్వర్గీయ డా.వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పోలవరం పూర్తి చేయడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు విఫలమయయని, ఆరోగ్య శ్రీ , ఫీజు రియంబరెన్స్ పథకాలను నిర్వీర్యం చేసారని ఆయన విమర్శించారు, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తేనే సామాన్యుడికి మేలు జరుగుతుందని జగన్ మురారి అన్నారు.
విశాఖ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పటిష్ట ప్రణాళిక విడుదల చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికలలో విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకొని, జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ బాధ్యత తీసుకుంటుందని ఆయన అన్నారు.
నగర ప్రజలకు ప్రభుత్వం లేదా అధికారుల నుండి ఇబ్బందులు ఎదురైతే 6305821260 ఫోన్ నెంబర్ లో మమల్ని సంప్రదిస్తే మీ తరుపున మేము పోరాడతామని జగన్ మురారి హామీ ఇచ్చారు.