విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆరు నెలల కిందట మూతబడిన బ్లాస్ట్ ఫర్నెస్ -2 సోమవారం ఉదయం పునః ప్రారంభం అయింది.దీనిని ప్లాంట్ సిఎండి ఏకె సెక్సేనాతో పాటు పలువురు అధికారులు ప్రారంభించారు. దీనిని ప్రారంభించడంతో నెలకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అదనంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. అంతరాయం లేకుండా కొనసాగించాలని కార్మిక యూనియన్ నాయకులు పేర్కొన్నారు.